పల్లెల స్వరూపం మారాలి ఇది కేసీఆర్ సంకల్పం… మంత్రి పువ్వాడ
-పల్లెల అభివృద్ధికి ప్రజలంతా భాగస్వాములు కావాలి
-పల్లెల ప్రణాళికలను రూపొందించండి
-హరిత హారం సీఎం మానస పుత్రిక …విరివిగా మొక్కలు నాటాలి
– పచ్చని పల్లెలను తయారు చేయాలి
– జిల్లాలో కేసీఆర్ ఆకస్మిక తనిఖీ ఉంటుంది
పల్లెల స్వరూపం మారాలి… పల్లెల అభివృద్ధికి ప్రజలంతా భాగస్వాములు కావాలి ….అందుకు మీ ఊరుకి ఏమేమి కావాలో ప్రణాళికలు రూపొందించుకోవాలి …. హరితహారంలో విరివిగా మొక్కలు నాటాలి … పచ్చని పల్లెలను , తయారు చేయాలి …. ఇది మన ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అందుకు ప్రజల అందరు సహకారం అవసరమని జిల్లామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం పాపటపల్లి , కోయచలక , రేగులచేలక గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఆయాగ్రామాలలో జరిగిన సభలలో ప్రసంగించారు. అన్ని రంగాలలో పల్లెలను అభివృద్ధి చేసుకునేందుకు సిఎం కేసిఆర్ కల్పించిన గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.
వివిధ అభివృద్ధి పథకాల అమలులో మన తెలంగాణ రాష్త్రం దేశానికే ఆదర్శంగా నిలబడిందని, ఇతర రాష్ట్రాలు మన తెలంగాణ ను అనుసరిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు అలా ఉంటాయని, ప్రజలకు అవసరమయ్యే చర్యలే తీసుకుంటారాని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ కు హరితహారం అంటే అత్యంత ఇష్టమని, ఇది ఆయన మానస పుత్రిక అని, దీనిని అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు.
కేసీఆర్ ఖమ్మం జిల్లాకు ఆకస్మిక తనిఖీకి ఎప్పుడొస్తారో తెలియదు కాబట్టి పల్లె ప్రగతి లో ముందుండలని జిల్లా కలెక్టర్ కు సూచించారు.
నేటి నుండి 10 రోజుల పాటు జరిగే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాన్ని ఖమ్మం నియోజకవర్గం రఘునాదపాలెం మండలం పాపాటపల్లి, కోయచలక, రేగులచలక గ్రామాల్లో పాల్గొన్న మంత్రి వైకుంఠదామంలు, కోయచలక గ్రామంలో 20 డబూల్ బెడ్ రూం ఇళ్ళు ప్రారంభించారు.
పల్లె ప్రగతి పనులు ప్రణాళిక బద్దంగా కొనసాగించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు విధిగా పాల్గొనాలని సూచించారు. ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి, అక్కడి అవసరాలను గుర్తించాలని, వాటిని ఈ పది రోజుల్లో చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఈ గ్రామ సభకు భాగస్వాములందరినీ ఆహ్వానించాలని చెప్పారు. అదేవిధంగా గ్రామంలో ఇంకా ఏయే అవసరాలు ఉన్నాయి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలో కూడా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని సమర్పించాలన్నారు.
ముఖ్యంగా దళిత వాడలకు వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయాలని, వారి అవసరాలు గుర్తించి, వాటిని తీర్చే విధంగా ప్రణాళిక తయారు చేసి, అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు అసంపూర్తిగా ఉంటే వెంటనే వాటిని పూర్తి చేయాలని, పూర్తి అయిన వాటిని తక్షణమే వాడుకలోకి తీసుకురావాలని సూచించారు.
గత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా ఎంతో ప్రగతి సాదించమన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్ దానికి తొట్టి, వాటర్ ట్యాంకర్, వైకుంఠదామం, డంపింగ్ యార్డ్, సెగ్రిగేషన్ షెడ్, నర్సరీ, పల్లె ప్రకృతి వనం లాంటివి చేసుకోవడం జరిగిందన్నారు.
రఘునాథ లపాలెం మండలం జింకలతండా వద్ద 148 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ రాబోతావుంది అని, అక్కడే విత్తనాభివృద్ది టెంస్టింగ్ కేంద్రం, మార్కెటింగ్ గోడౌన్లు వస్తున్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో రైతు బంధు రాష్ట్ర కన్వీనర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్ విజయ్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకట రమణ , అదనపు కలెక్టర్ స్నేహాలత , జడ్పీ సీఈఓ ప్రియాంక , డిపిఓ ప్రభాకర్, డిఆర్డివో విద్యా చందన g, ఎంపీపీ . జడ్పీటీసీ , సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.