Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేణుక చౌదరి ఇంట్లో కాంగ్రెస్ విందు రాజకీయం…

రేణుక చౌదరి ఇంట్లో కాంగ్రెస్ విందు రాజకీయం….
రేవంత్ ను భోజనానికి ఆహ్వానించిన రేణుక చౌదరి
ఉపాధ్యక్షలు , సంభాని , దామోదర్ రెడ్డి హాజరు
ఖమ్మం జిల్లా నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు హాజరు

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ వర్గరాజకీయాలు మరోసారి రచ్చకెక్కనున్నాయా ? అంటే అవుననే సమాధానమే వస్తుంది. అందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నమాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి వ్యూహాత్మకంగా విందు రాజకీయాలు చేస్తున్నారా ? అంటే “యస్” అనే అంటున్నారు. పరిశీలకులు …. ఇప్పటివరకు జిల్లా కాంగ్రెస్ పార్టీలో భట్టి తిరుగులేని నాయకుడుగా ఉన్నారు. ఆయన మాటే ఉమ్మడి జిల్లా పార్టీ వేదం…. కానీ పరిస్థితులు మారనున్నాయా? రేణుక చౌదరి తిరిగి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. జిల్లాకు చెందిన పీసీసీ ఉపాధ్యక్షుడుగా నియమితులైన మాజీమంత్రి సంభాని కూడా రేణుక శిభిరంలో ఉన్నారు . దీంతో ఆమె ఆలోచనలకు పదును పెట్టారు . టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంతో అంతకు ముందు రేవంత్ తో ఉన్న స్నేహం ఇందుకు ఉపయోగించేందుకు రంగంలోకి దిగారు . ఇటీవల కాలంలో యాక్టీవ్ రాజకీయాలకు దూరంగా ఉన్న , ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి విందు రాజకీయాలు మొదలు పెట్టారు. హైద్రాబాద్ బంజారహిల్స్ లో గల ఆమె నివాసంలో ఆమె నూతన పీసీసీ సారధి రేవంత్ రెడ్డి తోపాటు,ఉపాధ్యక్షులుగా నియమితులైన మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ , రామిరెడ్డి దామోదర్ రెడ్డి లను భోజనానికి ఆహ్వానించారు. ఖమ్మం జిల్లా నుంచి మానికొండ రాధాకిషోర్ , రాయల నాగేశ్వర రావు , వెంకటరామయ్య , మరికొందరు నేతలు హాజరైయ్యారు.

దీంతో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న కాంగ్రెస్ నేతలు తిరిగి రేణుక చౌదరి విందు రాజకీయంతో యాక్టీవ్ కానున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . రేణుక చౌదరి ఏర్పటు చేసిన విందు సమావేశానికి భట్టి అనువయాయులు ఎవరు హాజరు కాకపోవడం గమనార్హం .

అయితే కొత్త పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎలాటి వ్యూహాలతో ముందుకు పోతారు ? జిల్లాలో భట్టిని కాదని ఆయన రాజకీయాలు చేసేందుకు పార్టీ హైకమాండ్ అనుమతి ఇస్తుందా ? అంటే కాంగ్రెస్ లో ఏదైనా సాధ్యమే అంటున్నారు కొందరు … రేణుక చౌదరి విందు రాజకీయాల ప్రభావం ఎంత ఉంటుంది అనేది చూడాల్సిందే !

Related posts

అధికారం కోసమే బీజేపీ రాముడి మంత్రం…

Drukpadam

బోసిడికే అంటే మీరు బాగున్నారా అని కొత్త అర్థం చెప్పిన పయ్యావుల కేశవ్!

Drukpadam

తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న ఈటల మాటలు…

Drukpadam

Leave a Comment