Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విశాఖ ఉక్కు ప్రవేటీకరణ పై భగ్గుమంటున్న తెలుగు ప్రజలు…

విశాఖ ఉక్కు ప్రవేటీకరణ పై భగ్గుమంటున్న తెలుగు ప్రజలు
-ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ భారీ ర్యాలీ
-వైసీపీ ఎంపీ లు రాజీనామా చేయాలన్న టీడీపీ
-ఇప్పటికే విశాఖలో కొనసాగుతున్న ఆందోళనలు
-మరిన్ని ఆందోళనలకు సిద్ధపడుతున్న ప్రతిపక్షాలు
-సీఎం జగన్ నోరుఇప్పలని డిమాండ్
-హైదరాబాదులో చంద్రబాబును కలిసిన సీపీఐ రామకృష్ణ
-విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై రౌండ్ టేబుల్ భేటీ
-ఈ నెల 12న విజయవాడలో సమావేశం
-చంద్రబాబును ఆహ్వానించిన రామకృష్ణ
-ప్రైవేటీకరణకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందని వెల్లడి
-సీఎం జగన్ నోరు విప్పాలని డిమాండ్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను నిరసిస్తూ ప్రతిపక్షాల ఆధ్వరంలో భారీ ప్రదర్శన జరిగింది. నగరంలోని సరస్వతీ పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీ లో సిపిఎం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి కొవిడ్ రోగుల ప్రాణాలు నిలిపిన ఫ్యాక్టరీని మూసేస్తారా?: సిపిఎం నాయకులు ఎంఏ గఫూర్ ప్రశ్నించారు.
దేశ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు: జి. ఓబులేసు
వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్న పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా కార్మిక, ప్రజా సంఘాలు నిన్న నగరంలోని సరస్వతీ పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ మాట్లాడుతూ.. కరోనా రెండో దశలో టన్నుల కొద్దీ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి పలు రాష్ట్రాలకు అందించి ఎంతోమంది ప్రాణాలు నిలిపిన ఉక్కు పరిశ్రమను మూసివేయాలనుకోవడం దారుణమని, వెంటనే ఆ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, ఆయన సహచరులు దేశ సంపదను అదానీ, అంబానీలు, బహుళజాతి కంపెనీ పోస్కోకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు ఆరోపించారు.

వాజ్‌పేయి హయాంలో ప్రైవేటీకరణను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఎంపీ ఎర్రంనాయుడు అడ్డుకున్నారని, ఢిల్లీలో పోరాడితే మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు వెళ్తోందని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును రక్షించి విజయసాయిరెడ్డి తన నిబద్ధతను నిరూపించుకోవాలని అన్నారు. విశాఖ ఉక్కు కోసం అవసరమైతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విజయవాడ లో రౌండ్ టేబుల్ సమావేశం …చంద్రబాబు కు ఆహ్వానం

విశాఖ ఉక్కు ప్రవేటీకరణపై కేంద్రం వెనక్కు తగ్గకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయపక్షాలు ఆందోళన బాటకు సిద్ధపడుతున్నాయి . విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాగిన ఉద్యమంతో ఆనాడు దిగివచ్చిన ఇందిరాగాంధీ ప్రభుత్వం విశాఖకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వగా ఈ రోజు మోడీ ప్రభుత్వం దాన్ని ప్రవేట్ పరం చేయడానికి చర్యలకు ఉపక్రమించడంపై రాజకీయపార్టీలు మండి పడుతున్నాయి. ఇప్పటికే విశాఖలో గత కొన్ని నెలలుగా దీనిపై కార్మికులు రాజకీయపార్టీలు ఆందోళన చేపట్టాయి.

సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఇవాళ హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు.విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో విజయవాడలో నిర్వహించ తలపెట్టిన రౌండ్ టేబుల్ సమావేశానికి చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. దీనిపై చర్చించేందుకు ఈ నెల 12న విజయవాడలో అన్ని పార్టీలు, అన్ని సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. అనేక ఉద్యమాల ఫలితంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాగిన ఆందోలనతో దిగివచ్చిన ఆనతి ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రజల కోరికను మన్నించి ఉక్క కర్మాగారం ఏర్పాటుకు అంగీకరించిందని అన్నారు.

Related posts

పొంగులేటి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారా…?

Drukpadam

వివేకా హత్య కేసులో తనను ఇరికించే ప్రయత్నం ;ఎంపీ అవినాష్ అనుమానం …

Drukpadam

సమతాస్ఫూర్తికి బీజేపీ విఘాతం: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని!

Drukpadam

Leave a Comment