శరద్ పవార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బలపరుస్తాం: సీపీఐ నారాయణ!
బీజేపీ వ్యతిరేక పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తాం
ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం బూటకం
వెంకయ్యనాయుడు చెబితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది
శరద్ పవర్ రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని సిపిఐ నాయకుడు నారాయణ మరోసారి తెరపైకి తెచ్చారు . రాష్ట్రపతి ఎన్నికల్లో పవర్ అభ్యర్థిగా ఉంటె ఆయన్ను బలపరుస్తామని చెప్పారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటును సిపిఐ స్వాగతిసందని అన్నారు. దేశంలో బీజేపీ పాలనా అప్రజాస్వామికంగా ఉందని విమర్శనించారు. మోడీ ప్రభుత్వం కరోనా ను ఎదుర్కోవడంలో విఫలమైందని అన్నారు. మోడీ మానియా తగ్గిందని అందుకు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలే నిదర్శనం అన్నారు.
దేశంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మిగతా విషయాలపై మోడీ ప్రభుత్వం దృష్టి సారించిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ ప్రరిశ్రమలను ప్రవేట్ పరం చేసేందుకు చర్యలు ప్రారంభించిందని అందులో భాగంగానే విశాఖ ఉక్కును ప్రవేట్ పరం చేయబోతున్నారని అన్నారు. విశాఖ ఉక్క ప్రవేట్ ఫారం కాకుండా అడ్డుకునే శక్తి రాష్ట్రానికి చెందిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కి మాత్రమే ఉందని ఆయన ఒక్క మాట చెపితే ప్రవేటీ కరణ ఆగిపోతుందని నారాయణ అభిప్రాయపడ్డారు. అందుకు ఆయన జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
2023లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బలపరుస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకోవాలని నారాయణ కోరారు. ఆయన ఒక్క మాట చెబితే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందని అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై నారాయణ మాట్లాడుతూ.. ఇదంతా బూటకమని, ప్రజల్లో భ్రమను కలగించడం ద్వారా వారి మెప్పు పొందేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జల వివాదానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న పెట్రో ధరలపై మాట్లాడుతూ.. పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని నారాయణ డిమాండ్ చేశారు.