జర్నలిస్టులపై కేసు నమోదు ను ముక్తకంఠం తో ఖండించిన అఖిలపక్షం
టీ న్యూస్ సాంబశివరావు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ పై కేసులు ఉపసంహరించుకోవాలి
మీడియాపై అణచివేత ధోరణి మానుకోవాలి: సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు
మీడియాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు: సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు హేమంతరావు
అక్రమ కేసులు అనేవి మంచిది కాదు: పువ్వల దుర్గా ప్రసాద్ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు
కేసు ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు: టి జె ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ
యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యను కవరేజ్ కోసం వెళ్ళిన ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో సాంబశివరావు,సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి లపై కేసు నమోదు చేయడాన్ని అఖిలపక్ష పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. తక్షణమే టీ న్యూస్ బృందంపై సాక్షి ఎడిటర్ పై కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో టియుడబ్ల్యూజే టీజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులపై అక్రమ కేసుల అంశంపై టీజిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి సమన్వయకర్తగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం, బి ఆర్ ఎస్, టీయూడబ్ల్యూజే ఐ సి యు , న్యూడెమోక్రసీ ఇతర ప్రజా సంఘాలను నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లేందుకు వార్త కవరేజ్ కి వెళ్లిన వారి జర్నలిస్టులపై ప్రభుత్వం నిర్బంధాలు కొనసాగించడం తగదన్నారు. టీవీ ఛానల్ ను పత్రికలను భజన మీడియా గా మార్చుకున్నందుకు పాలకవర్గం ఇలాంటి నిర్బంధాలు ప్రయోగిస్తుందని విమర్శలు చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులపై రచయితలపై దాడులు మరింత పెరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యను వాస్తవమైన విషయాన్ని వార్తా కథనాలుగా రాస్తే తప్పేంటి అని వారు ప్రశ్నించారు? పాలకవర్గాలు మారిన జర్నలిస్టులపై నిర్బంధాలు యధావిధిగా కొనసాగుతున్నాయని భవిష్యత్తులో జర్నలిస్టులపై కేసు నమోదు చేయాలంటే భయపడేలా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సాంబ, నాగరాజు రాజేష్, సాక్షి ఎడిటర్ ధనుంజయ్ లపై కేసులు ఉపసంహరించుకోకపోతే మరోసారి ప్రత్యక్ష ఆందోళనకు నిర్వహించాలని తీర్మానించారు.
మీడియాపై అణచివేత ధోరణి మానుకోవాలి: సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పి రంగారావు

స్వతంత్రంగా ఎదగాలనే మీడియా ఆలోచన నిర్బంధల ద్వారా లోపర్చుకోవాలని ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని రాష్ట్ర కార్యదర్శి పి .రంగారావు అన్నారు యూరియా వార్తలను వాస్తవమైన విషయాలను కవరేజ్ చేసినందుకు రాజ్య ద్రోహం కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు. బిజెపి పాలిత ప్రాంతాలలో జర్నలిస్టులపై దాడులు మరింత పెరిగాయని ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే అదే ధోరణితో వ్యవహరిస్తుందని అన్నారు. కేసును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మీడియాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు: సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు బి హేమంతరావు

గత ప్రభుత్వం హయంలో కొనసాగిన నిర్బంధాలే కాంగ్రెస్ హయాంలో కూడా కొనసాగుతున్నాయని సిపిఐ జాతీయ నేత భాగం హేమంత్ రావు అన్నారు. మాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే కేసులు నమోదు చేస్తామని బెదిరించడం సరికాదన్నారు.బిజెపి పాలిత ప్రాంతంలో దాడులు ఎక్కువయ్యాయని, తెలంగాణలో యూరియా సమస్యను రాసిన నేతలపై రాజ ద్రోహం కేసులు పెట్టడం ప్రజాస్వామ్యం కాదన్నారు.
అక్రమ కేసులు మంచి సంప్రదాయం కాదు: పువ్వల దుర్గా ప్రసాద్ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు

జర్నలిస్టులపై మా ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడదని, ఒకవేళ అక్రమ కేసులు బనాయిస్తే అది మంచి సంప్రదాయం కాదని డిసిసి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పి.దుర్గ ప్రసాద్ అన్నారు. గోపవరం లో యూరియా సమస్యను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పాలని అత్యుత్సాహం తో రైతులను రెచ్చగొట్టినట్టు మా దృష్టికి వచ్చిందని రైతు స్వ హస్తాలతో రాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్టేషన్లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న జర్నలిస్టుల పక్షానే తమ పార్టీ ఉంటుందని పేర్కొన్నారు.
జర్నలిస్టుల పై వెంటనే కేసు నమోదు చేసే పద్ధతి మానుకోవాలి: రామ్ నారాయణ ఐ జె యు రాష్ట్ర కార్యదర్శి
జర్నలిస్టులు అనగానే వెంటనే కేసు నమోదు చేసి చర్యలు మానుకోవాలని ఐ జె యు రాష్ట్ర కార్యదర్శి రామ్ నారాయణ అన్నారు. జర్నలిస్టులపై కేసు కుటుంబం మీదనే ప్రభావం ఉంటుందని,కానీ దాని ప్రభావం అధికార పార్టీకి అధికారులకు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. యూరియా కోసం మంత్రీ తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్న కృషిని స్వాగతిస్తున్నాను అని అదే సందర్భంలో కేసులు నమోదు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
యూరియా కొరత అంశాన్ని కప్పిపుచ్చుకునేందకె కేసులు: బి ఆర్ ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు
సకాలంలో రైతులకు యూరియా అందించే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలం అయిందని వాస్తవమైన విషయాలను ప్రసారం చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు? ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అడ్డుకునేందుకే మీడియా ప్రతినిధులపై కక్ష సాధింపు కేసులో నమోదు చేసిందని ఆరోపించారు.
100శాతం కుట్రపూరితమైన కేసు నమోదు చేశారు: అడ్వకేట్ జె ఎ సి చైర్మన్ తిరుమల రావు
రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న జర్నలిస్టుపై 100 శాతం కుట్రపూరిత మైన కేసు నమోదు చేశారని అడ్వకేట్ చేసి చైర్మన్ తిరుమల రావు అన్నారు. గవర్నర్ ,దేశ ప్రధానిలపై దాడి చేస్తే నమోదు చేసే సెక్షన్స్ పెట్టి చట్ట విరుద్ధంగా నిర్బంధించే కుట్ర ప్రభుత్వం వైపు నుంచి జరిగిందని తక్షణమే కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
దుర్మార్గమైన చర్య.. అధికారంలో కి రాగానే మారిపోతారా? :*సి పి ఎం
కళ్యాణ వెంకటేశ్వరరావు
యూరియా సమస్య కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టులు పై కేసు నమోదు చేయడం దుర్మార్గమైన చర్యని సిపిఎం నాయకులు కళ్యాణ వెంకటేశ్వరరావు అన్నారు. ప్రతిపక్షం నుండి అధికారంలోకి రాగానే జర్నలిస్ట్ ను నిర్బంధిస్తారా
? అని ప్రశ్నించారు. సిపిఎం సిఐటియు నిరంతరం జర్నలిస్టుల పక్షాన ఉంటుందని తెలిపారు
ఉన్నది ఉన్నట్లు రాస్తే ఉలుకెందుకు ? వృత్తిపరమైన ఆటంకాలు సృష్టిస్తే ఊరుకునేది లేదు *: ఐ జె యు రాష్ట్ర నాయకులు మాటేటి వేణుగోపాల్ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు ఏనుగు వెంకటేశ్వరరావు, మైసా పాపారావు *
ప్రభుత్వ వైఫల్యాలను ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు వివరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతుందని ఐజెయు నేతల ప్రశ్నించారు? బాధ్యత కలిగిన జర్నలిస్టులకు వృత్తిపరమైన అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని తిరుగుబాటు ఉదృతం చేస్తామని వారు పేర్కొన్నారు. జర్నలిస్టుకు ఎక్కడ అన్యాయం జరిగిన తుది పోరుకు ఐజె యు సిద్ధంగా ఉంటుందని వారు తెలిపారు.
జర్నలిస్టుల రక్షణ చట్టం తేవాలి: కనకం సైదులు చైర్మన్ స్థంబాద్రి మ్యూచివల్ కో – ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాస్తవమైన విషయాలు టెలికాస్ట్ చేస్తే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు పోలీసులు ఇతర రాజకీయ నాయకులు స్నేహపూరితంగా వ్యవహరిస్తూ దాడులు కేసులు పెడుతున్నారని. తక్షణమే జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రభుత్వానికి నష్టం:బొల్లం శ్రీనివాస్ కార్యదర్శి
వార్త కవరేజీ విషయంలో ఏకపక్షంగా ఆలోచిస్తూ జర్నలిస్టులపై కేసులను నమోదు చేయడం సరైనది కాదని దీని పర్యావసనాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని శ్రీనివాస్ హెచ్చరించారు.
అధికార అహంకారంతో జర్నలిస్టులపై కేసుల నమోదు చేస్తే తిరుగుబాటు బలంగా ఉండేలా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మోహన్ రావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జితేందర్ రెడ్డి, క్లెయిమెంట్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుల నరేందర్, పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి వెంకటేష్ జర్నలిస్టులకు మద్దతుగా మాట్లాడారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వారిలో టీ జె ఎఫ్ టెంజు జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీ కాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, ఐ జె యు రాష్ట్ర నాయకులు మురారి ఎలెక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు మామిడాల భూపాల్, కార్యదర్శి మహేందర్, ఐ జె యు నగర అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీనివాస్, నామా పురుషోత్తం,టి జె ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దుంపటి భాస్కర్, మందుల ఉపేందర్,ఆర్ టీవీ ఉదయ్, 6టివి హరీష్, శ్రీధర్ శర్మ, చక్రవర్తి, అమరవరపు కోటేశ్వర రావు, రామిశెట్టి విజేత , ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, టెంజు నగర అధ్యక్షులు యాలమందల జగదీష్, కార్యదర్శి అశోక్ ఉపాధ్యక్షులు సాయి, కిరణ్, కల్యాణ్, సాయి, , కొమ్ము ఉపేందర్, జీవన్ రెడ్డి వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు సుధాకర్, రంగా నాగేశ్వర రావు, బాబు,సతీష్, పృధ్వీ, శంకర్,ఫోటో గ్రాఫర్ యూనియన్ నాయకులు రాజు, మహేశ్, స్టార్ శ్రీను, రవి శంకర్ టి జె ఎఫ్ నాయకులు ముత్యాల కోటేశ్వరరావు అంతోటి శ్రీనివాస్,నరేందర్, మోదుగు శ్రీధర్, నల్లమోతు శ్రీనివాస్, ఇస్సాంపల్లి వెంకటేశ్వర్లు, కూరపాటి నరేష్, ఈశ్వరి, తోట గణేష్,బి శేఖర్ తదితరులు పాల్గొన్నారు