Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎం పీ సోయం బాబురావు రాజీనామా చేయాలి:ఆదివాసీల డిమాండ్

ఎంపీ రాజీనామా చేయాలి:ఆదివాసిల డిమాండ్

ఎస్టీ జాబితానుంచి లంబాడాలను తొలగిస్తానన్న మాటనిలబెట్టు కోలేదు….

అదిలాబాద్: ఎస్టి జాబితాలో నుండి లంబాడాలను తొలగిస్తామని చెప్పి ఆదివాసీలను మోసాగిస్తున్న ఆదిలాబాద్ ఎంపి సోయం బాపూరావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం సమావేశమైన ఆదివాసీ నాయకులు ఎంపి సోయం బాపూరావు తీరును తప్పుబడుతూ రాజీనామాకు డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆదివాసి సంఘల నాయకులు మాట్లాడుతూ. లంబాడా హటావో ఆదివాసి బచావో నినాదంతో తుడుం దెబ్బ నాయకత్వంలో మొదట కాంగ్రెస్ పార్టీతో జత కట్టిన సోయం బాబురావు ఆ తర్వాత ఎంపి టికెట్ కోసం బిజెపితో జత కట్టారని అన్నారు.

తన రాజకీయ లబ్దికోసం తుడుం దెబ్బను వాడుకుంటూ ఆదివాసీలను మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రతిసారి ఏదో రాజకీయ పార్టీకి తుడుం దెబ్బను తాకట్టు పెడుతూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు.

లంబాడాలను తొలగించడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ అమాయక ఆదివాసీలను మోసగించేందుకు ఇస్తున్నారని ఆరోపించారు.

అటు లంబాడాలను తొలగించడమే లక్ష్యంగా పోరాడిన సోయం బాపురావు ఇప్పుడు లంబాడ నాయకుడైన రాథోడ్ రమేష్ లంబాడాల టైగర్ అంటూ తాను ఆదివాసీల టైగర్ అంటూ మాట్లాడడం సిగ్గు చేటన్నారు. లంబాడా హటావో ఉద్యమాన్ని పక్కదోవ పట్టించి, లంబాడాలతో దోస్తీ చేస్తున్న సోయం బాపురావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని 9 ఆదివాసీ తెగల నాయకులుగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు

Related posts

మాజీ సీఎం జగన్ భద్రతపై క్లారిటీ ఇచ్చిన ఏపీ పోలీసుశాఖ!

Ram Narayana

మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి బిగ్ షాక్.. హైకోర్టులో సంచలన పిటిషన్

Drukpadam

రాజమండ్రిలో కొన్ని క్షణాలపాటు మాయమైన నీడ!

Drukpadam

Leave a Comment