తెలుగు రాష్ట్రాలు

పవన్ కల్యాణ్‌తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం..

  • మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో భేటీ
  • దాదాపు రెండు గంటల పాటు సమావేశమైన పవన్, రంగనాథ్
  • మర్యాదపూర్వక భేటీ అని పవన్ కల్యాణ్ కార్యాలయం ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ సమావేశమయ్యారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్‌లో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల రక్షణకు హైడ్రా కృషి చేస్తోన్న విషయం తెలిసిందే. హైడ్రా హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములను పరిరక్షించింది.

ఈ నేపథ్యంలో వీరి మధ్య రెండు గంటల పాటు సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నగరంలో హైడ్రా పనితీరు తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని పవన్ కల్యాణ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Related posts

దసరా ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్.. రెట్టింపు చార్జీల వసూలు

Ram Narayana

ప్రేమ వివాహం, ఆర్థిక కష్టాలు.. ఐ బొమ్మ రవి జీవితంలో అసలేం జరిగింది?

Ram Narayana

కర్నూలు బస్సు ప్రమాదం: మాట మార్చిన రెండో డ్రైవర్ శివనారాయణ!

Ram Narayana