Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు !

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఓటర్ల తుది జాబితా విడుదల

  • జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు 
  • ఓటర్లలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు 
  • నోటిఫికేషన్ తర్వాత పెరిగిన 2,383 మంది ఓటర్లు

హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు.

నియోజకవర్గంలో నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని, వీరిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత జూబ్లీహిల్స్‌లో 2,383 మంది ఓటర్లు పెరిగినట్లు ఆయన తెలిపారు.

ఎన్నికల నేపథ్యంలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు రూ. 2.84 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, అలాగే రూ. 3.69 లక్షల విలువ చేసే 512 లీటర్ల మద్యం పట్టుకున్నామని తెలిపారు. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నందున ఒక్కో పోలింగ్ బూత్‌లో నాలుగు బ్యాలెట్ యూనిట్స్, ఒక వీవీప్యాట్ వినియోగిస్తామని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు

Jubilee Hills ByElection 58 Candidates in the Fray
  • నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్
  • 58 మంది పోటీ పడుతున్నట్లు తెలిపిన రిటర్నింగ్ అధికారి
  • నామినేషన్లు ఉపసంహరించుకున్న 23 మంది

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, 81 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు కలిపి మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా, 58 మంది పోటీలో ఉన్నట్లు ఆర్వో వెల్లడించారు.

ఇంతమంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే మొదటిసారి. గతంలో 2009 ఎన్నికల్లో 13 మంది, 2014లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది, 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది పోటీ చేశారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసారి పోటీలో ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలో ఉన్నారు.

Related posts

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని బీజేపీ హామీ ఇవ్వలేదు ..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Ram Narayana

టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) మూడవ మహాసభలకు సిద్దమవుతున్న ఖమ్మం…

Ram Narayana

అబ్బేప్రణీత్ రావు ఎవరో నాకు తెలియదు …మాజీమంత్రి ఎర్రబెల్లి

Ram Narayana

Leave a Comment