ఖమ్మం ఆసుపత్రిలో రాధను పరామర్శించిన డోర్నకల్ , మహబూబాబాద్ ఎమ్మెల్యేలు..
గత మూడు రోజుల క్రితం రోడ్ ప్రమాదంలో గాయాలపాలై ఖమ్మంలోని ఒక ప్రవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న డోర్నకల్ దిశ రిపోర్టర్ రామకృష్ణ సతీమణి రాధని పలువురు పరామర్శించారు … పరామర్శించిన వారిలో ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్, మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళినాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ యాదవ్, కాలం రవీందర్ రెడ్డి, శిలం శ్రీనివాస్, కోటిలింగం, ఆంగోత్ వెంకన్న, రవి, పగడాల మధు, అశ్వక్, జామల తదితరులు ఉన్నారు . వారు ప్రత్యేకంగా ఖమ్మం వచ్చి ఆమెకు జరిగిన ప్రమాదాన్ని అందుతున్న వైద్యసహాయాన్ని గురించి డాక్టర్ ను అడిగితెలుసుకున్నారు …ఆటో లో ముందు కూర్చున్న ఆమె కు రెండు కాళ్లు చేతితో పాటు మరికొన్ని చోట్ల ఫ్రాక్చర్స్ అవడంతో ఆపరేషన్ కోసం టైం తీసుకుంటుందని డాక్టర్ తెలిపారు ..ఎక్కువ చోట్ల ఫ్రాక్చర్స్ అయినందున చాల జాగ్రత్తగా కేసును హ్యాండిల్ చేయాల్సి ఉందని తెలుస్తుంది ..
రోజులాగానే ఆమె కురవి మండలం నేరడ వద్ద ఉన్న గురుకుల పాఠశాలకు విధినిర్వహణలో భాగంగా తోటి ఉద్యోగస్తులతో కలిసి ఆటోలో వెళ్ళుతుంది … ఆ క్రమంలో ఎదురుగ వస్తున్న ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టింది ..దీంతో ముందు భాగంలో ఉన్న రాధాకు బలమైన గాయాలైయ్యాయి..వెంటనే మహబూబాబాద్ హాస్పిటల్ కు తర్వాత ఖమ్మం హాస్పిటల్ కు ఆమె ను తరలించారు …