తెలుగు రాష్ట్రాలు

హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణం..మావోయిస్టు పార్టీ ఆరోపణ

హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే కారణం.. అడవి నుంచి బయటికి వచ్చిన కోసాల్ అనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణం.. విజయవాడకు చెందిన కలప వ్యాపారితోపాటు ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్ కారకులు.., అక్టోబర్ 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్ళాడు..
ఆ…సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతోనే 13 మందిని పట్టుకొని హత్య చేశారు.. హత్యను కప్పిపుచ్చేందుకు మారేడుమల్లి, రంపచోడవరం ఎన్ కౌంటర్ ల కట్టుకథ అల్లారు. హిడ్మా హత్య ఒక ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్ కాదు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ ఇది.. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని శపథం చేస్తున్నాం..” అని లేఖలో పేర్కొన్నారు.

మావోయిస్టు వికల్ప్‌ పేరుతో మరో లేఖ విడుదల..

అగ్ర నేతలు దేవ్‌జీ, రాజిరెడ్డిలు మాతో ఉన్నారు.. హిడ్మా సమాచారాన్ని దేవ్‌జీ చెప్పారనడం అవాస్తవం.. చికిత్స కోసం హిడ్మా విజయవాడ వెళ్లారు.. విజయవాడలోని కలప, ఫర్నీచర్‌ వ్యాపారులు మాకు ద్రోహం చేశారు.. పోలీసులు హిడ్మాను సజీవంగా పట్టుకున్నారు.. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ బూటకం.. 13 మందిని పట్టుకుని ఏపీ పోలీసులు కాల్చి చంపారు.. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటాంమని వికల్ప్‌ లేఖలో పేర్కొన్నారు

Related posts

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి ఇక రెండున్నర గంటలే.. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే రూట్ ఖరారు

Ram Narayana

విశాఖలో తీవ్ర విషాదం: కూతురి పెళ్లి ఆగిపోయిందని తండ్రి ఆత్మహత్య

Ram Narayana

యశోదా ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు

Ram Narayana