తెలంగాణ వార్తలు

రామగుండం థర్మల్ కేంద్రం మూసివేత…

ఐదు దశాబ్దాలుగా తెలంగాణకు సేవలందించిన రామగుండం థర్మల్ స్టేషన్ మూసివేయబడింది.రాష్ట్రంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం థర్మల్ స్టేషన్ ను అధికారులు మూసివేశారు.

1971 అక్టోబర్‌లో USAID సహకారంతో స్థాపించిన తొలి థర్మల్ స్టేషన్‌గా రామగుండం థర్మల్ స్టేషన్‌గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ప్లాంట్ మొత్తం 18743.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన ఈ ప్లాంట్ జీవితకాలం ముగిసిందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరువు ప్రభావిత జిల్లాల్లోని వ్యవసాయ పంపుసెట్లకు ఈ యూనిట్ నుంచి విద్యుత్ సరఫరా చేసేవారు. నాలుగు దశాబ్దాలకు పైగా నిరంతరాయంగా సేవలు అందించిన ఈ థర్మల్ స్టేషన్ తాజాగా మూతపడటంతో చారిత్రక ఘట్టంగా నిలిచింది.

Related posts

కబ్జాల వార్తలు రాస్తే చంపేస్తా.. ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపులు

Ram Narayana

రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్‌కు అండగా నిలిచారు, సోదరుడిగా నేనూ అండగా నిలుస్తా!: మంద కృష్ణ మాదిగ!

Ram Narayana

అందమైన అమ్మాయితో డేటింగ్ ఆశ.. రూ.6.5 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!

Ram Narayana