తెలంగాణ వార్తలు

రామగుండం థర్మల్ కేంద్రం మూసివేత…

ఐదు దశాబ్దాలుగా తెలంగాణకు సేవలందించిన రామగుండం థర్మల్ స్టేషన్ మూసివేయబడింది.రాష్ట్రంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం థర్మల్ స్టేషన్ ను అధికారులు మూసివేశారు.

1971 అక్టోబర్‌లో USAID సహకారంతో స్థాపించిన తొలి థర్మల్ స్టేషన్‌గా రామగుండం థర్మల్ స్టేషన్‌గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ప్లాంట్ మొత్తం 18743.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన ఈ ప్లాంట్ జీవితకాలం ముగిసిందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరువు ప్రభావిత జిల్లాల్లోని వ్యవసాయ పంపుసెట్లకు ఈ యూనిట్ నుంచి విద్యుత్ సరఫరా చేసేవారు. నాలుగు దశాబ్దాలకు పైగా నిరంతరాయంగా సేవలు అందించిన ఈ థర్మల్ స్టేషన్ తాజాగా మూతపడటంతో చారిత్రక ఘట్టంగా నిలిచింది.

Related posts

‘హైడ్రా’ పేరిట రేవంత్ ప్ర‌భుత్వం వ‌సూళ్లు.. బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Ram Narayana

మంద కృష్ణతో విభేదాలు లేవు, ఆయన నాకంటే మోదీని ఎక్కువగా నమ్ముతున్నారు: రేవంత్ రెడ్డి

Ram Narayana

ఫలించిన చర్చలు.. ముగిసిన ఆర్టీసీ సమ్మె.. రోడ్డెక్కిన బస్సులు..

Ram Narayana