ఆంధ్రప్రదేశ్

జగన్ గుంటూరు పర్యటన… పలువురు నేతలపై కేసులు నమోదు…

  • గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్
  • జగన్ పర్యటన సందర్భంగా ర్యాలీలు నిర్వహించిన పలువురు వైసీపీ నేతలు
  • ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారంటూ కేసులు నమోదు

అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత చేపట్టిన గుంటూరు పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు హల్ చల్ చేశారు. పోలీసు యాక్ట్ 30ను పట్టించుకోకుండా అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… నల్లపాడులో పోతిన మహేశ్, బలసాని కిరణ్ కుమార్ పై కేసు నమోదయింది. మంగళగిరిలో నూనె ఉమామహేశ్వర్ రెడ్డి, తాడేపల్లిలో దొంతిరెడ్డి వేమారెడ్డిపై, నగరంపాలెం ప్రాంతంలో పానుగంటి చైతన్య, నూరి ఫాతిమా, గుంటూరు పట్టాభిపురంలో అంబటి మురళిపై కేసులు నమోదయ్యాయి. 

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ… వైసీపీ నేతలు చేపట్టిన ర్యాలీల కారణంగా గుంటూరులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. పోలీసు నిబంధనలను ఉల్లంఘించడం, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఈ క్రమంలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Related posts

వైద్యురాలి వేషంలో ఆసుపత్రిలోకి వెళ్లి దొరికిపోయిన యువతి ..!

Ram Narayana

తెనాలిలో యువకుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు!

Ram Narayana

కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు.. విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదం..

Ram Narayana