తమ్మినేని వీరభద్రంపై అభిశంసన …పార్టీకి లాభమా నష్టమా …?
ఇంతకీ తమ్మినేని చేసిన అపరాధం ఏమిటి …
సభల్లో తన అభిప్రాయాన్ని చెప్పడం ..అందుకు అనుగుణంగా వ్యవహరించడం తప్పేలా అవుతుంది
పార్టీ లైన్ కు భిన్నంగా వ్యవహరించారని ఎలా చెపుతారు
సెక్రటరీ ఎన్నికల్లో కేంద్రకమిటీ సిఫార్స్ చేసిన వ్యక్తిని ఎన్నుకోవాలనే నిబంధన ఉందా …?
తమ్మినేనిపై అభిశంసన వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ..అది పార్టీకి నష్టమా …?లాభమా ..?అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి… ఇంతకీ తమ్మినేని చేసిన అపరాధం ఏమిటి …? అంటే పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికలో పార్టీ లైన్ తప్పాడని ..ఇందులో కూడా రరకాల వాదనలు ఉన్నాయి… తనకు నచ్చిన వాణ్ణి కార్యదర్శిగా పెట్టాలని అనుకోవడంలో తప్పు ఏముందని అనే వారు లేకపోలేదు .. లేదు పార్టీ ఒకరిని పెట్టాలనుకుంటే ఆయన అందుకు భిన్నంగా వ్యవహరించి తప్పు చేశారనే వాదనలు ముందుకు వస్తున్నాయి.. సభల్లో తన అభిప్రాయం చెప్పి అందుకు అనుగుణంగా వ్యవహరించడం తప్పు ఎలా అవుతుందనే వారు లేకపోలేదు ..రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక కేంద్రకమిటీ సిఫార్స్ చేసిన వ్యక్తిని ఎన్నుకోవలనే నిబంధన ఉందా …అనే ప్రశ్నలు ఉన్నాయి..అయితే పార్టీ లైన్ పై పార్టీనే వివరణ ఇవ్వాలి .. ఇది వారి అంతర్గత వ్యవహారమే …

తమ్మినేని వీరభద్రం సామాన్యుడి నుంచి సిపిఎం అగ్రనేతగా ఎదిగిన వ్యక్తి .. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అనేకమందిని మార్క్సిస్టులుగా తయారు చేసిన గొప్ప వ్యక్తి , తన యావజ్జీవితం ఎర్రజెండా రాజ్యం రావడం ద్వారానే పేదల బతుకులు బాగుపడతాయని నమ్మి అందుకు అహోరాత్రులు కృషి చేసిన నాయకుడు…దీంతో కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం ను పార్టీ అభిశంసన చేసిందనే వార్త పార్టీలో ప్రకంపనలు పుట్టించింది .పార్టీలో ఎంతటి పెద్ద నాయకుడైన క్రమశిక్షణ కట్టుతప్పితే శిక్ష తప్పదనే హెచ్చరికలను పార్టీ చేసింది .. తమ్మినేని పై అభిశంసన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది . సహజంగానే ఆయనంటే గిట్టని వారికీ ఆనందం కల్గించి ఉండవచ్చు ..ఖమ్మం జిల్లా నాయకుల్లో పార్టీని అగ్రభాగాన నిలబెట్టిన నాయకుడు తమ్మినేని అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ..మంచి స్నేహశీలి , సిద్ధాంత కర్త , పార్టీ లైన్ ను ప్రజలకు సులభమైన పద్దతిలో చెప్పడంలో ఆయనకు సాటి ఎవరు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ..అనేకమంది రాజనీతి శాస్త్రంలో డాక్టరేట్ పొందినా , ఆయన ముందు బలాదూరే …ఆర్థిక శాస్త్రంలోనూ నిపుణుడు …మంచి వ్యూహకర్త , వక్త మాటల్లో చాకచక్యం… ఆయన ఉపన్యాసం అంటే పార్టీలకు అతీతంగా వినేవారు ఉన్నారు … అందుకు ఆయన గొంతు ఒక వరం …అంతే కాదు ఎదుటివారిని మెప్పించి ఒప్పించడంలో అపర రాజకీయ చాణిక్యుడు..ఆయనలో కొన్ని లోపాలు ఉన్నా , పార్టీ కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహానేత … అనేక గొప్పలక్షణాలు కలిగిన తమ్మినేనిపై అభిశంసన వార్త ఆయనతో నాకున్న సంబంధం రీత్యా భాద కలిగించింది . నిరంతరం పార్టీ కోసం శ్రమించిన వ్యక్తిపై అభిశంసనా…? అనే అభిప్రాయం కల్గింది .అయితే అది పార్టీ అంతర్గత వ్యవహారమని కదా అని నాకు నేను సర్దు కున్నాను .. పార్టీ నియమ నిబంధనావళి ప్రకారం కట్టుతప్పితే అంతర్గత చర్యలు తీసుకోవచ్చు …గతంలో తీసుకున్న సందర్భాలు ఉన్నాయి… వాటిని బయటకు లీక్ చేయడమే పార్టీ చేసిన పొరపాటు అనే భావన కల్గింది .. తమ్మినేని పై చర్యలు అనగానే చెవులు కొరుక్కునే వారు ఆనందపడే వారు బయలు దేరారు . వాళ్ళంతా సిపిఎం మేలు కోరేవారా …? అంటే కానే కాదు, వారికీ కావాల్సిందల్లా ఎర్రజెండాలు బలహీన బడటం..తమలో ఉన్న కమ్యూనిస్ట్ వ్యతిరేకతతో ఆనందపడటం … ఇలాంటి సంఘటనలు పార్టీలో కొత్త కాదు పాత కాదు అనేక మంది నాయకులపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది ..దేశంలో త్రిపుర ముఖ్యమంత్రిగా ఆదర్శ పాలన అందించిన అప్పటి పొలిట్ బ్యూరో సభ్యుడు నృపేన్ చక్రవర్తి పై వేటు తప్పలేదు …అనేక సంవత్సరాలు సిపిఎం లోకసభ పక్ష నాయకుడిగా లోకసభ స్పీకర్ గా పనిచేసిన చేసిన సోమనాథ్ ఛటర్జీ పై చర్యలు తీసుకున్నారు ..మన రాష్ట్రంలో మద్దికాయల ఓంకార్, భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి ఉద్దండులపై పార్టీ చర్యలు తీసుకున్నది ..

కొంతమంది ఆయనపై చర్యలు తీసుకోవడం తప్పు రైటు గురించి డొంకతిరుగుడు చర్చలు జరుపుతున్నాయి… ఆయన్ను అసలు రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనవచ్చు కానీ సలహాలు సూచనలు ఇవ్వొద్దన్నారని అభిశంసన కంటే పెద్ద పనిష్మెంట్ అని , తమ్మినేని పై పార్టీ కఠినంగా ఉందని రకరకాలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. తమ్మినేనిపై ఇప్పుడే కాదు ఇంతకూ ముందు కూడా అనేక రకాల వార్తలు వచ్చాయి ..అయితే నేను గమనించినంతవరకు తమ్మినేని నిండుకుండా లాంటి వాడు ..ఏ విషయంలో తొందరగా బయటపడరు …అది ఆయన బలం , బలహీనత కూడా అయి ఉండవచ్చు .. అది కొన్ని సందర్భాలలో ఆయనకు నష్టం కూడా తెస్తుంది …!