Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్​ షా!

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్​ షా
-సున్నిపెంట వద్ద స్వాగతం పలికిన ఏపీ మంత్రి వెల్లంపల్లి
-ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత
-దర్శనానంతరం భ్రమరాంభ అతిథి గృహంలో భోజనం

శ్రీశైలం మల్లన్నను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు చేరుకున్న ఆయన.. అక్కడి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో సున్నిపెంటకు చేరుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి, కలెక్టర్, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునుడి దర్శనార్థం ఆలయానికి వెళ్లారు. ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. దర్శనానంతరం ఆయన భ్రమరాంభ అతిథి గృహానికి చేరుకుని అక్కడే భోజనం చేయనున్నారు. తిరిగి హైదరాబాద్ కు వెళ్లి అక్కడి నుంచి 3.50 గంటలకు ఢిల్లీకి బయల్దేరతారు. కాగా, అమిత్ షా మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం శుభసూచకమని బీజేపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

కాగా అమిత్ షా రాక కేవలం వ్యక్తిగతమని శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వచ్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కుటుంబసమేతంగా వచ్చారు. ఆయనకు ఏపీ ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖామంత్రి వెళ్లపల్లి శ్రీనివాస్ స్వాగతం పలికారు.

Related posts

నేను సైతం అంటూ అస్సాల్ట్ రైఫిల్ అందుకున్న మాజీ మిస్ ఉక్రెయిన్

Drukpadam

సీఎం జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు…

Drukpadam

ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కెదురు.. 

Drukpadam

Leave a Comment