అంతర్జాతీయం

కెనడా మాజీ ప్రధాని ట్రూడో, అమెరికన్ పాప్‌స్టార్ చెట్టాపట్టాల్…

కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో, అమెరికన్ పాప్‌స్టార్ కేటీ పెర్రీ డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ జంట కాలిఫోర్నియాలో జరిగిన ఒక సంగీత వేడుకలో కలిసి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను కేటీ పెర్రీ సోషల్ మీడియాలో పంచుకుంది. చేతిలో చేయి వేసి నడవడం, కూర్చుని డ్రింక్స్ తాగడం వంటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

దాదాపు పదేళ్ల పాటు కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో, గత సంవత్సరం ప్రారంభంలో రాజీనామా చేశారు. ఈ క్రమంలో గత సంవత్సరం జూలైలో వీరిద్దరు మాంట్రియాల్‌లోని ఒక రెస్టారెంటులో కనిపించారు. వీరు డేటింగ్‌లో ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత విలాసవంతమైన నౌకపై వీరు సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.

డేటింగ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ వీరిద్దరు మాత్రం స్పందించలేదు. కానీ తరచూ వీరిద్దరు కలిసి దర్శనమిస్తున్నారు. ట్రూడో తన భార్య సోఫీ గ్రెగోరీకి 2023లో విడాకులిచ్చారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నటుడు ఓర్లాండో బూమ్‌తో ఏడేళ్లుగా కలిసి ఉంటున్న కేటీ పెర్రీ గత సంవత్సరం అతనితో విడిపోయారు.

Related posts

భూమ్మీద పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో 60 శాతం ఆ 12 దేశాల నుంచే.. తాజా రిపోర్టులో వెల్లడి

Ram Narayana

హైదరాబాద్-మాల్దీవ్స్ మధ్య నేరుగా విమానాలు.. అందుబాటులోకి తెచ్చిన ఇండిగో

Ram Narayana

వారిని కాల్చిపారేయండి: షేక్ హసీనా ఆడియో లీక్

Ram Narayana