తెలంగాణ వార్తలు

బీఆర్స్ ఎమ్మెల్యే చామకూరి మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరుతుందా ..?

బీజేపీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి

  • హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన ప్రీతిరెడ్డి
  • పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో భేటీ
  • కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీని కలిసిన మల్లారెడ్డి కుటుంబం

బీఆర్స్ ఎమ్మెల్యే విద్యాసంస్థల అధినేత చామకూరి మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరుతుందా …? అంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చునని అంటున్నారు పరిశీలకులు … మల్లారెడ్డి వ్యవహారం  నేడు తెలంగాణ రాజకీయాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది ..ఇటీవలనే మల్లారెడ్డి కుటుంబం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిశారు ..అప్పుడే ఆయన బీజేపీకి దగ్గర అవుతున్నారనే ప్రచారం జరిగింది …అయితే ఆయన దాన్ని ఖండించారు …తన విద్యాసంస్థలు దేశంలో అనేక ముఖ్యమైన నగరాల్లో ఉన్నాయని విద్యాసంస్థల్లో దేశంలోనే నేనే నెంబర్ వన్ అని చెపుతున్నా ఆయన కోడలు ప్రీతిరెడ్డి  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని  రామచంద్రరరావు కొన్ని రోజుల క్రితం  కలిశారు  .. తిరిగి శుక్రవారం ఆమె బీజేపీ కార్యాలయానికి ఆమె స్వయంగా వెళ్లి పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో  ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే తాము బీజేపీ లో చేరడంలేదని లక్ష మందితో వందేమాతరం కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు బీజేపీ నాయకులతో చర్చించేందుకు వెళ్లానని ప్రీతి రెడ్డి చెపుతున్నా నమ్మశక్యంగా లేదని ఎదో ఒక కార్యక్రమం పేరుతో బీజేపీతో స్నేహం చేసేందుకు సిద్ధమవుతున్నారని రాజకీయ పండితుల అభిప్రాయం.. 

మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వచ్చే నెలలో తమ విద్యాసంస్థల ఆధ్వర్యంలో సుమారు లక్ష మందితో నిర్వహించతలపెట్టిన ‘వందేమాతరం’ ఆలాపన కార్యక్రమానికి సంబంధించి చర్చించే అంశంపై ఆమె బీజేపీ కార్యాలయానికి వచ్చారని తెలుస్తోంది.

ఇటీవల తన కుటుంబంతో కలిసి మల్లారెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన కోడలు బీజేపీ కార్యాలయానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రీతిరెడ్డి రెండు రోజుల క్రితం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో కూడా సమావేశమయ్యారు.

నేను బీజేపీలో చేరడం లేదు: మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి

Preeti Reddy clarifies she is not joining BJP
  • బీజేపీ కార్యాలయానికి వెళ్లిన ప్రీతిరెడ్డి
  • బీజేపీ నేతలతో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టీకరణ
  • విద్యావేత్తను కాబట్టి అన్ని పార్టీలతో కలుస్తానన్న ప్రీతిరెడ్డి

తాను బీజేపీలో చేరడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం ఆమె నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆమె బీజేపీ కార్యాలయానికి వెళ్లడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో సమావేశమయ్యారు.

ఈ భేటీపై ఆమె మీడియాతో మాట్లాడుతూ, తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను విద్యావేత్తనని గుర్తుంచుకోవాలని అన్నారు. తాను అన్ని పార్టీలను కలుస్తానని అన్నారు. డిజిటల్ ఇండియా కోసం అన్ని పార్టీల నేతలను కలుస్తున్నట్లు ఆమె తెలిపారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు తెలిపారు.

Related posts

కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి!

Ram Narayana

ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జి

Ram Narayana

ముగిసిన మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు … పాడె మోసిన కేటీఆర్, హరీశ్ రావు

Ram Narayana