Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సమయం లేదు మిత్రమా.. మహావిపత్తు అంచున భూమి: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక!

సమయం లేదు మిత్రమా.. మహావిపత్తు అంచున భూమి: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక!
-శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రతల్లో 2.7 డిగ్రీలు పెరుగుదల
-పారిస్ ఒప్పందానికి రెట్టింపు
-జీవరాశికి పెను విపత్తు అన్న యూఎన్ చీఫ్

భూగ్రహం మహావిపత్తుకు అంచున ఉందా? అంటే అవుననే ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదిక హెచ్చరిస్తోంది. భూమండలమీద ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి చేసిన హెచ్చరిక నేపథ్యంలో ఆందోలనలు వ్యక్తం అవుతున్నాయి . అయితే ఇప్పుడు కాదండోయ్ …. ఈ శతాబ్దం చివరినాటికి అంటున్నారు శాస్తవేత్తలు …. ఇదే జరిగితే మానవజాతి మనుగడకే ముప్పు ….జీవకోటి జీవించడం ప్రస్నార్ధకమే … ఇప్పటికే ఓజోన్ పొర పై అనేక వల్ల మానవజాతి మనుగడకు పెనుప్రమాదం ఉందని వింటున్నాం … ఉష్ణోగ్రతలు పెరిగితే తట్టుకోవడం కష్టం … ముఖ్యంగా జీవరాసులు ఇప్పటికే అనేకం కనుమరుగౌతున్నాయి. ఒకప్పటి కాకులు ,పిచుకలు కంటికి కనపడటంలేదు. … కోకిల రాగాలు వినిపించడంలేదు. గద్దలు అసలు దర్శనం ఇవ్వడంలేదు. హిందూ సంప్రదాయంలో గద్దజాతి పక్షులకు విశిష్ట ప్రాధాన్యం ఉంది. జంతువుల సంఖ్యా ఘననీయంగా తగ్గుతుందనేది ఆందోలనకర అంశం .

యూఎన్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ భూతాపానికి సంబంధించి తాజా నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఈ శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు పెరుగుతాయని హెచ్చరించింది. అయితే, భూతాపాన్ని తగ్గించాలంటే ఉష్ణోగ్రతల సగటు పెరుగుదలను 1.5 డిగ్రీల లోపే ఉండేలా చూడాలని శాస్త్రవేత్తలు చెబుతూ వస్తున్నారు.

ఈ నివేదికను చూస్తుంటే భూమి మహావిపత్తు వైపు శరవేగంగా దూసుకుపోతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు పెరగడమంటే విపత్తేనని అన్నారు. 1.5 డిగ్రీల దగ్గరే ఉంచుతామని ఆరేళ్ల క్రితం పారిస్ ఒప్పందం హామీ గాల్లో కలిసిపోయినట్టేనని ఆవేదన చెందారు. లక్ష్యాన్ని అందుకోలేకపోతే భూమ్మీద జీవరాశి వినాశనానికి దారి తీస్తుందని ఆందోళన చెందారు. ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి మన దగ్గర అన్ని ఆయుధాలున్నా.. సమయం మాత్రం వేగంగా కరిగిపోతోందని చెప్పారు.

Related posts

ఏపీలో అల్లర్లు: ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ నియామకం…

Ram Narayana

హరిత తెలంగాణ కోసమే గ్రీన్ ఇండియా ఛాలెంజ్….ఎంపీ సంతోష్…

Drukpadam

అమెరికాలో అంతర్యుద్ధం తప్పదు..రష్యా మాజీ అధ్యక్షుడి జోస్యం…

Drukpadam

Leave a Comment