Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజమండ్రి వైసీపీ లో కుమ్ములాట … ఎమ్మెల్యే రాజా వర్సెస్ ఎంపీ మార్గాన్ని భరత్!

రాజమండ్రి వైసీపీ లో కుమ్ములాట … ఎమ్మెల్యే రాజా వర్సెస్ ఎంపీ మార్గాన్ని భరత్!
-రాజమండ్రిలో వైసీపీని ఎంపీ భరత్ సర్వనాశనం చేస్తున్నాడని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజం
-రాజమండ్రి వైసీపీ నేతల మధ్య భగ్గుమన్న విభేదాలు
-ఎంపీ భరత్ పై ధ్వజమెత్తిన జక్కంపూడి రాజా
-భరత్ తనను ఏం చేయలేరని స్పష్టీకరణ
-భరత్ వి పిచ్చిచేష్టలని విమర్శలు

రాజమండ్రి వైసీపీ లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ మరగని భరత్ పై ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. తూర్పు గోదావరి జిల్లాలో కొంతకాలం క్రితం రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ , కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య జిల్లాపరిషత్ సమావేశం సాక్షిగా పరస్పరం దుమ్మత్తి పోసుకున్నారు. విషయం సీఎం జగన్ దాక పోయి ఇద్దరు మెత్తబడి రాజీపడ్డారు. తిరిగి ఎమ్మెల్యే రాజా ఎంపీ భరత్ పై తీవ్ర విమర్శలు చేయడం పార్టీ లోని అనైక్యతను చూచిస్తుందని రాజకీయవిశ్లేషలులు అభిప్రాయపడుతున్నారు. జడ్పీటీసీ ,ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించామని సంబరాలు జరుపుకుంటున్న వైకాపాకు రాజమండ్రి లో ఎంపీ ,ఎమ్మెల్యే మధ్య తగాదా కొత్త చిక్కులు తెచ్చిపెట్టినట్లు అయింది. అసలే నిరంతరం ప్రతిపక్ష పార్టీల అడ్డంకులతో సతమతమౌతున్న జగన్ కు తలనొప్పిగా మారె ప్రమాదం ఉందని పరిశీలకుల అభిప్రాయం . ఇదే కొనసాగితే అనేక జిల్లాలలో ఉన్న సమ్మతి వాదులు రోడ్డు వెక్కి ప్రమాదం ఉంది.

వైసీపీ ఎంపీ మార్గాని భరత్, ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ భరత్ పై జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలో వైసీపీని ఎంపీ భరత్ సర్వనాశనం చేస్తున్నారని రాజా మండిపడ్డారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కలిసి భరత్ సెల్ఫీలు తీసుకుంటారా? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. సీఎం జగన్ ను ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తులతో భరత్ కు పనేంటి? అని నిలదీశారు.

రౌడీ షీటర్లు, భూకబ్జాదారులు భరత్ వెనుక ఉన్నారని ఆరోపించారు. ఎంపీ భరత్ పిచ్చిచేష్టలకు పాల్పడుతున్నారని, తనను మాత్రం ఏంచేయలేరని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు.

Related posts

స‌స్పెన్ష‌న్‌ను బీజేపీ నేత‌లు కోరుకున్నారు: హ‌రీశ్ రావు!

Drukpadam

కరోనా ఎఫెక్ట్: వర్చువల్‌గానే టీడీపీ మహానాడు!

Drukpadam

తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ప్రభావం తగ్గిందా ?

Drukpadam

Leave a Comment