Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల ఖమ్మం టూర్ లో గిరిజనులతో ముఖాముఖీ

షర్మిల ఖమ్మం టూర్ లో గిరిజనులతో ముఖాముఖీ
-పోడుభూములే ప్రధాన ఎజెండా
-వైయస్ ఆర్ పథకాల కొనసాగింపే లక్ష్యంగా అడుగులు
-నేతలు ఎవరు పాల్గొంటారని దానిపై నిఘావర్గాల ఆరా ?
డాక్టర్ వై .యస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె , వై .వైస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ఖమ్మం జిల్లా పర్యటనకు ఈ నెల 21 న వస్తున్నారు . ఆమె పార్టీ పెడుతున్నట్లు చెప్పటం ఒక సంచలనంగా మారింది. ఇప్పటికే నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం అయిన షర్మిల తరువాత జిల్లాగా ఖమ్మం పై ద్రుష్టి సారించారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోని ఈజిల్లాలో రాని విధంగా ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ, ఖమ్మం పార్లమెంట్ సీట్లు గెలిచారు. ఆ ఎన్నికల ప్రచారంలోనూ అంతకుముందు జరిగిన పాదయాత్రలోను ఆమె జిల్లాలో పాల్గొన్నారు. ఇక్కడ నాయకులతో ఆమెకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. దీనితో ఆమెతో ఎవరెవరు పయనిస్తున్నారు. అనేది ఆశక్తిగా మారింది . హైదరాబాద్ నుంచి భారీకాన్వాయ్ తో ఖమ్మం కు వస్తారని షర్మిల క్యాంపు కార్యాలయం వర్గాలు తెలిపాయి . ఖమ్మంలో వైయస్ అభిమానులు అధికసంఖ్యలో ఉన్నారు. అందువలన ఖమ్మం పర్యటనలో పోడుభూముల విషయంలో గిరిజనులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తుంది .

Related posts

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ …సీఎల్పీ నేత భట్టి!

Drukpadam

కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం పై ఈటల మండిపాటు…

Drukpadam

ఆత్మరక్షణలో ఎం ఐ ఎం …బీజేపీతో లాలూచి లేదని వెల్లడి!

Drukpadam

Leave a Comment