Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆకాశం నుంచి పడిన అరుదైన రాయి… తహసీల్దార్ కు అప్పగించిన రైతు!

ఆకాశం నుంచి పడిన అరుదైన రాయి… తహసీల్దార్ కు అప్పగించిన రైతు!
-మహారాష్ట్రలో ఘటన
-వర్షంతో పాటు పొలంలో పడిన రాయి
-వెండి, బంగారు వర్ణంలో మెరుస్తున్న రాయి
-స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు
-పరిశోధనలు చేస్తున్న జీఎస్ఐ

మహారాష్ట్రలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఉస్మానాబాద్ జిల్లా వసీలో ఆకాశం నుంచి ఓ అరుదైన రాయి కిందపడింది. ప్రభు అనే రైతు తన పొలంలో ఉండగా, పెద్ద వర్షం కురిసింది. ఆ వర్షంతో పాటే రాయి కూడా పొలంలో పడింది. వెండి, బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ రాయి ఆకాశం నుంచి పెద్ద శబ్దంతో పడడం ఆ రైతును విస్మయానికి గురిచేసింది. దాంతో ఆ రాయి వంటి పదార్థం గురించి స్థానిక తహసీల్దార్ కు సమాచారం అందించారు.

ఆ రాయిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) వారికి అప్పగించారు. ఇది ఎంతో అరుదైన రాయి అయ్యుంటుందని రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండున్నర కేజీల బరువున్న ఆ రాయిపై జీఎస్ఐ పరిశోధనలో మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన షురూ ….ఐదు రాష్ట్రాల అధ్యక్షులు రాజీనామాకు ఆదేశం !

Drukpadam

మమతా బెనర్జీకి ఈసీ షాక్‌.. దీదీ ప్రచారంపై 24 గంటల నిషేధం!

Drukpadam

గవర్నర్ తన విశేష అధికారాలతో టీఎస్ పీఎస్సీని రద్దు చేయాలి: రేవంత్ రెడ్డి

Drukpadam

Leave a Comment