Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కెప్టెన్ అమరీందర్ కాషాయ కండువా కప్పుకోనున్నారా ?

కెప్టెన్ అమరీందర్ కాషాయ కండువా కప్పుకోనున్నారా ?
-సొంత పార్టీ పెట్టనున్నారా ??
-ఇటీవల సీఎం పదవి నుంచి తప్పుకున్న పంజాబ్ కాంగ్రెస్ నేత
-రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూతో వివాదం
-కాంగ్రెస్‌పై అక్కసుతో బీజేపీలో చేరతారని ప్రచారం

అమరిందర్ సింగ్ …పంజాబ్ మాజీముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత రెండు సార్లు పంజాబ్ లో కాంగ్రెస్ పరభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నేత …కొద్దీ నెలల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించి బడ్డ నవజ్యోత్ సింగ్ తో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. సిద్దును అధ్యక్షుడిగా నియమించేందుకు ససేమిరా అన్నారు. అయినప్పటికీ అమరిందర్ అభిప్రాయాన్ని కాదని సిద్ధుకి పంజాబ్ పీసీసీ పగ్గాలు అప్పగించింది. చివరకు ఇద్దరిమధ్య ఏర్పడ్డ బేదాభిప్రాయాలు అమరిందర్ ను సీఎం పీఠం నుంచి దించేలా చేశాయి. ఆయన రాజినామా చేసిన అనంతరం నూతన సీఎం ను కాంగ్రెస్ అధిష్టానం సూచనమేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలూ సేకరించి నియమించారు.

ఇటీవల ఒక జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూ లో తాను ఎట్టి పరిస్థితిలో సిద్దు ను పంజాబ్ ముఖ్యమంత్రి కానివ్వమని చెప్పారు.నేడు దేశరాజధాని ఢిల్లీలో కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ పర్యటిస్తున్నారు. దీంతో ఇప్పుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ గురించి ఆసక్తికర విషయం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మాజీ సీఎం త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడంటూ పంజాబ్‌లో రాజకీయవర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతుంది. నూతన వ్యవసాయ చట్టాల తెచ్చిన బీజేపీ లో చేరితే రాజకీయంగా దిగజారిపోవడం ఖాయం అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అందువల్ల కాంగ్రెస్ ను దెబ్బగొట్టేందుకు సొంతపార్టీ పెడతారా ? లేక బీజేపీ లో చేరతారా ? అనే ఆశక్తి పంజాబ్ రాజకీయాల్లో నెలకొన్నది .

ఈ సందర్భంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌ను ఆయన కలిసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీలో చేరేందుకు అమరీందర్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయనకు కాషాయ పార్టీ నుంచి అద్భుతమైన ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. అసలే తనను సీఎం పదవి నుంచి తొలగించారని కాంగ్రెస్‌పై అక్కసుతో ఉన్న అమరీందర్ ఇదే అదనుగా భావించి కాషాయ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది.

పంజాబ్ కాంగ్రెస్‌లో అమరీందర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య వివాదం రోజురోజుకూ పెరిగి పెద్దదవుతోంది. ఈ క్రమంలోనే అమరీందర్‌ను సీఎం పదవి నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం తప్పించింది. ఇదే సమయంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవిని అమరీందర్‌కు బీజేపీ ఆఫర్ చేసిందట.

దీంతో ఆయన కూడా బీజేపీలో చేరేందుకు ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నేరుగా బీజేపీలో చేరడం కెప్టెన్‌కు ఇష్టం లేకపోతే, సొంత పార్టీ పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలనూ కొట్టి పారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related posts

కాపులను జగన్ కు తాకట్టు పెట్టారు…ముద్రగడపై హరిరామజోగయ్య ఫైర్

Drukpadam

కేసీఆర్ పై కేఏ పాల్ అనుచిత వ్యాఖ్యలు …

Drukpadam

గోవాకు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు…

Drukpadam

Leave a Comment