రాజకీయ వార్తలు

తెలంగాణకు చెందిన ఓ పోలీసు అధికారి చంద్రబాబుతో కుమ్మక్కయ్యారు: విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణ…

తెలంగాణకు చెందిన ఓ పోలీసు అధికారి చంద్రబాబుతో కుమ్మక్కయ్యారు: విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణ…
-డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ వర్సెస్ వైసీపీ
-ఢిల్లీలో విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు
-ఆ అధికారిపై కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి
-ఆ పోలీసు అధికారి పేరు వెల్లడించని వైనం

ఇటీవల డ్రగ్స్ అంశం తీవ్ర పరిణామాలకు దారితీసిన నేపథ్యంలో, టీడీపీ నేతలు, ఇతర విపక్ష నేతలు ఓ తెలంగాణ పోలీసు అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

తెలంగాణకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని పేర్కొన్నారు. ఆ అధికారి తెలంగాణ-ఏపీ సరిహద్దు జిల్లాలో పనిచేస్తున్నాడని వెల్లడించారు. ఆ పోలీసు అధికారి ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న తన మిత్రులైన ఇతర పోలీసు అధికారులకు ఏపీలోని అరకు లోయలో గంజాయికి సంబంధించిన దాడులు చేయాలంటూ సూచిస్తున్నాడని కూడా విజయసాయి ఆరోపించారు.

అయితే, ఆ పోలీసు అధికారి పేరును విజయసాయి వెల్లడించలేదు. అతడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను అందులో పనిచేస్తున్న అధికారులను వినియోగిచుకోవడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు . గతంలో కూడా అనేక ఉదంతాలు మనకళ్ల ముందే ఉన్నాయని పేర్కొన్నారు.

Related posts

కేంద్రమంత్రి నారాయణ్ రాణేపై బాంబే హైకోర్టు ఆగ్రహం!

Drukpadam

ఏపీ, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లకు ప్రత్యేక హోదా ఇవ్వండి.. కేంద్రానికి విజయసాయి నేతృత్వంలోని స్థాయీ సంఘం సిఫార్సు!

Drukpadam

ఎన్టీఆర్‌కు నమస్కారం చేయాలి.. సోనియమ్మకు థ్యాంక్స్ చెప్పాలి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

Drukpadam