Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట…జగన్ సంచలన నిర్ణయాలు!

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట…జగన్ సంచలన నిర్ణయాలు!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన సజ్జల
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్
డిసెంబరు 10న పోలింగ్
అభ్యర్థులను ఎంపిక చేసిన వైసీపీ అధినాయకత్వం
వెనుకబడిన వర్గాలకు అత్యధిక స్థానాలు

ఎన్ని వత్తుడులు వచ్చిన ముందుగా ప్రకటించిన ప్రకారం ఏపీ సీఎం జగన్ చట్టసభల్లో బీసీలకు పెద్ద పీట వేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థానిక సంస్థలనుంచి ఎన్నికయ్యే ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ఎంపిక చేసింది. 11 స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉండగా అందులో 6 స్థానాల్లో బీసీ ఎస్సీ లకు సీట్లు కేటాయించారు. మిగతా వాటిలో రెండు కాపులకు , రెండు కమ్మ సామజిక వర్గానికి ,మరొకటి రెడ్డి సామజిక వర్గానికి కేటాయించారు. ఎవరు ఊహించని విధంగా బీసీ సామాజికవర్గాలలో ఉన్న అత్యంత వెనకబడి గుర్తింపులేని కులాలకు కూడా కార్పొరేషన్ చైర్మన్లుగా ,స్థానికి సంస్థల్లో సర్దుబాటు చేస్తున్నారు. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది . తాను చెప్పిన మాటకు కట్టుబడి చట్టసభల్లో సైతం సామాజిక వర్గాల వారీగా సీట్లను కేటాయిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పడు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థుల వైసీపీ ప్రకటించింది

ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం తెలిసిందే. డిసెంబరు 10న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తమ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 11 స్థానాల్లో అత్యధికం వెనుకబడిన వర్గాలకు కేటాయించినట్టు తెలుస్తోంది.

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు- కాపు)
తలశిల రఘురాం (కృష్ణా జిల్లా- కమ్మ సామాజిక వర్గం)
మురుగుడు హనుమంతరావు (గుంటూరు- చేనేత)
వై.శివరామిరెడ్డి (అనంతపురం- రెడ్డి సామాజిక వర్గం)
అనంత ఉదయభాస్కర్ (తూర్పు గోదావరి- కాపు)
ఇందుకూరు రఘురాజ్ (విజయనగరం- క్షత్రియ)
వరుదు కల్యాణి (విశాఖ- బీసీ- వెలమ)
వంశీకృష్ణ యాదవ్ (విశాఖ- యాదవ)
మొండితోక అరుణ్ కుమార్ (కృష్ణా- ఎస్సీ సామాజిక వర్గం)
కేఆర్ జే భరత్ (చిత్తూరు- బీసీ. వన్యకుల క్షత్రియ)
తూమాటి మాధవరావు (ప్రకాశం- కమ్మ సామాజిక వర్గం)

ముందుగా అనంతపురం నుంచి మాజీ ఎమ్మెల్యే విశ్వేశర్ రెడ్డి ,గుంటూరుకు చెందిన మర్రి రాజశేఖర్ పేర్లు ప్రచారంలోకి వచ్చిన వారికీ సీట్లు కేటాయించలేదు .ఇద్దరు జగన్ కు అత్యంత సన్నిహితులు కావడం విశేషం ….

Related posts

కోయంబత్తూరులో కమల్ హాసన్ ముందంజ…

Drukpadam

ప్రధాని మోడీ పర్యటన నిరసించండి …కూనంనేని

Drukpadam

లఖింపూర్ ఖేరీ హింసలో మరణించిన రైతు కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం!

Drukpadam

Leave a Comment