Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు రోగుల సేవలపై ఆరా !

-ఆరోగ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ తొలి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది: హరీశ్ రావు
-నీలోఫర్ ఆసుపత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును ప్రారంభించిన హరీశ్
-రూ. 10 వేల కోట్లతో ఆరోగ్యశాఖను బలోపేతం చేస్తామన్న హరీశ్
-కరోనా మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్య

హరీష్ రావు రాష్ట్ర ఆరోగ్యశాఖ భాద్యతలు స్వీకరించినతరువాత స్పీడ్ పెంచారు. శాఖపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్షలతోపాటు జిల్లాలలో జరుగుతున్న కరోనా వాక్సినేషన్ పై నివేదికలు పరిశీలిస్తున్నారు.వైద్యారోగ్యశాఖ కు మంచి పేరు తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. హాస్పటల్స్ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. రోగులు పొందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకుంటున్నారు. హరీష్ రాకతో శాఖలో కొంత కదలికలు మొదలయ్యాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి .

హైదరాబాదులోని నీలోఫర్ ఆసుపత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును ఆరోగ్యమంత్రి హరీశ్ రావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమంత్రిగా తొలి కార్యక్రమం నీలోఫర్ లో పాల్గొనడం సంతోషకరంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో రూ. 10 వేల కోట్లతో ఆరోగ్యశాఖను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీలోఫర్ లో రూ. 33 కోట్లతో మరో 800 పడకలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు మారేలా వైద్యులు సేవలందించాలని కోరారు.

హైదరాబాద్ నగరానికి నలువైపులా మెడికల్ టవర్లను నిర్మించేందుకు కృషి చేస్తామని హరీశ్ చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతమయ్యాయని అన్నారు. కరోనా మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని… దానికోసం రూ. 133 కోట్లు కేటాయించామని చెప్పారు. కేసీఆర్ కిట్ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 30 శాతం నుంచి 50 శాతానికి పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.

Related posts

ఉక్రెయిన్ సరిహద్దులకు భారీగా రష్యా దళాలు… 

Drukpadam

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు!

Drukpadam

రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకూ అరువు అడగొద్దంటూ పోస్టర్!

Drukpadam

Leave a Comment