Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు టెక్ రవి మృతి..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు టెక్ రవి మృతి..
-బాణం బాంబుల బాంబులను పరీక్షిస్తున్న పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదం..
-టెక్ రవి మృతిని ఏడాదిన్నరగా రహస్యంగా ఉంచిన మావోయిస్టు పార్టీ
-నేడు టెక్ రవి చనిపోయినట్లు లేఖ విడుదల

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందారని మావోయిస్టు సెంట్రల్ కమిటీ విడుదల చేసిన ఒక ప్రకటనలోతెలిపింది . టెక్ టీం లో కీలక భాద్యతలు నిర్విస్తున్న రవి జార్ఖండ్ ప్రాంతంలో బాంబులు తయారు చేసి పరీక్షిస్తున్న సమయంలో అది ప్రమాదవసాత్తు పేలి రవి దుర్మరణం చెదరని పార్టీ తెలిపింది. జార్ఖండ్ లోని మారుమూల ప్రాంతంలో రవి మృతి చెందినట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించడంతో అనేక మంది ఆయన సహచరులు దిగ్బ్రాంతి కి గురయ్యారని సమాచారం . టెక్నికల్ టీమ్ లో కీలక సభ్యులుగా కొనసాగిన రవి. కమ్యూనికేషన్స్ తోపాటుగా ఎలక్ట్రానిక్ డివైస్ తయారు చేయడంలో రవి దిట్ట. రవి చనిపోయిన సంవత్సరన్నర తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించటం గమనార్హం . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక దాడులకు ఆయన టెక్నికల్ గా ఉపయోగ పడ్డారని ప్రచారం ఉంది. అప్పట్లోనే ఆయన్ను తమిళనాడు లో అరెస్ట్ చేశారు. తరువాత బయటకు వచ్చి తిరిగి దళంలోకి వెళ్ళాడు. అప్పటినుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నాడు . పార్టీ అప్పగించినాపనిని చేయడంలో మంచి దిట్ట . ఇక్కడ నుంచి ఆయన జార్ఖండ్ ప్రాతంలో పార్టీకి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా పంపించింది. కేంద్ర కమిటీలోకి కూడా రవిని తీసుకున్నారు. ప్రమాద వశాత్తు మరణించినప్పుడు ఎందుకు చెప్పలేదని సందేహాలు ఉన్నాయి. ఏడాదిన్నరగా పోలీసులకు సైతం ఈ విషయం తెలియకుండా మావోలు జాగ్రత్త పడ్డారు . వరస దెబ్బలతో మావోయిస్టు పార్టీ ఇబ్బందుల్లో ఉండనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఇటీవలనే కేంద్రకమిటీ కాలాక నేతగా ఉన్న ఆర్ కె మరణించారు. నిన్నగాక మొన్న మరో అగ్రనేత ప్రశాంత్ బోస్ మరణించారు. మహారాష్ట్రలోని గార్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో 26 కి పైగా మావోయిస్టులు మరణించారని వార్తలు వస్తున్నాయి.

Related posts

శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో పిల్లికి ఉద్యోగం.. ఎందుకంటే!

Drukpadam

శీలానీవే శిల్పీ నీవే శిల్పం నీవే శృష్ఠిలో …

Drukpadam

కేసీఆర్ రాజీనామా చేయాలి: ఈటల రాజేందర్

Drukpadam

Leave a Comment