Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం స్థానిక సంస్థల టీఆర్ యస్ అభ్యర్థి ముమ్మర ప్రచారం!

ఖమ్మం స్థానిక సంస్థల టీఆర్ యస్ అభ్యర్థి ముమ్మర ప్రచారం!
-నియోజవర్గాలలో సమావేశాలు
-ఖమ్మం లో మంత్రి సమక్షంలో కార్పొరేటర్ల సమావేశం
-పాల్గొన్న మంత్రి పువ్వాడ , అభ్యర్థి తాతా మధు , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఖమ్మం స్థానిక సంస్థల అభ్యర్థిగా అధికార టీఆర్ యస్ నుంచి పోటీచేస్తున్న తాతా మధు ప్రచారాన్ని ప్రారంభించారు. ఖమ్మంతో పాటు వివిధ నియోజకర్గాలలో పర్యటిస్తూ ఓటర్లను కలుసు కుంటున్నారు. ఖమ్మంలో జరిగిన సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వరంలో ఖమ్మం కార్పొరేటర్ల సమావేశం జరిగింది. వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ యస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తాతా మధు ను గెలిపించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తాతా మధు ను అత్యధిక మెజార్టీ తో గెలిపించి కానుకగా ఇవ్వాలి అన్నారు. జిల్లాలో ఎన్నిక లాంఛనమేనని ,టీఆర్ యస్ కు మూడింట రెండు వంతుల మెజారిటీ ఉందని అందువల్ల పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కదని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం గులాబీ గుమ్మంగా మార్చుకున్నామని ,రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉందని దాన్ని నిలబెట్టుకునేలా మన విజయం ఉండాలని మంత్రి అన్నారు.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ యస్ కు ఉన్న బలం మరెవరికికి లేదని మన అభ్యర్థి గెలుపు సునాయాసంగా ఉంటుందని అన్నారు. కేసీఆర్ నిర్ణయించిన అభ్యర్థిగా మధు వచ్చారని ఉన్నత విద్యావంతుడు , జిల్లా అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాడని అందువల్ల మధు విజయం కోసం అందరం కృషి చేయాలనీ అన్నారు.

అభ్యర్థి తాత మధు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ ,మంత్రి అజయ్ ,ఎంపిక చేసిన అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని నాకు వేసే ప్రతి ఓటు కేసీఆర్ కువేసినట్లే నాని అన్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ యస్ కు పూర్తీ మెజార్టీ ఉన్నందున విజయం ఖాయమైనప్పటికీ అప్రమత్తంగా ఉండి ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకోని వచ్చి పోల్ చేయించుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో మేయర్ పున్ను కోళ్ళు నీరజ,జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జి ఆర్జేసీ కృష్ణ , సూడా చైర్మన్ బచ్చు విజయ్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రసన్న లక్ష్మీ, నగర్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు , జడ్పీటీసీ ప్రియాంక అన్ని డివిజన్ల కార్పొరేటర్లు ఉన్నారు.

 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ యస్ విజయం ఏకపక్షమే: జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు

 

స్ధానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు టీఆర్ యస్ పార్టీకి ఏకపక్షంగా ఉంటాయని ,పార్టీ అధ్యక్షుడు, మన నాయకుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు…. బుధవారం నాడు మధిర లోని టీఆర్ యస్ పార్టీ కార్యాలయంలో మధిర మండలం, మున్సిపాలిటీ, ఎర్రుపాలెం మండలాలకు చెందిన పార్టీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో 70% పైగా టీఆర్ యస్ పార్టీ నుండి ఎన్నికైన జడ్పీటీసీ లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారని ఆయన తెలిపారు…ఈ ఎన్నికల్లో ఖమ్మం స్థానానికి టీఆర్ యస్ పార్టీ అభ్యర్థి తాతా మధు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన స్పష్టం చేశారు… ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 

స్థానిక సంస్థల్లో టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాతా మధు నేడు వైరా లో పర్యటించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ , రాజశేఖర్ ఉన్నారు. టీఆర్ యస్ అభ్యర్థి మధు ను గెలిపించాలని పిలుపు నిచ్చారు.

Related posts

విదేశాల్లో మోదీకి ఉన్న ఇమేజ్ ను దెబ్బతీయాలని అనుకోలేదు: రాకేశ్ టికాయత్!

Drukpadam

వరంగల్ లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న జేపీ నడ్డా, బండి!

Drukpadam

పంజాబ్ కాంగ్రెస్ లో ముసలం …..

Drukpadam

Leave a Comment