రోశయ్య మృతితో ఎంతో బాధకు గురవుతున్నా: మోదీ
రోశయ్యతో మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి
ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి
రోశయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా
అత్యున్నత విలువలకు మారుపేరు రోశయ్య: సీజేఐ ఎన్వీ రమణ
రోశయ్య భౌతికకాయానికి నివాళి అర్పించిన ఎన్వీ రమణ
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారన్న సీజేఐ
రోశయ్య మరణం తెలుగువారందరికీ తీరని లోటని వ్యాఖ్య
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రోశయ్య మృతితో ఎంతో బాధకు గురయ్యానని చెప్పారు. తామిద్దరం ముఖ్యమంత్రులుగా పని చేసినప్పుడు, ఆయన తమిళనాడు గవర్నర్ గా ఉన్నప్పుడు తమ మధ్య జరిగిన సంభాషణలు గుర్తొస్తున్నాయని తెలిపారు.
సమాజం కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. రోశయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రోశయ్య తనను కలిసినప్పటి ఫొటోను షేర్ చేశారు.
అత్యున్నత విలువలకు మారుపేరు రోశయ్య: సీజేఐ ఎన్వీ రమణ
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన రోశయ్య నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ… పరిపాలనా దక్షుడిగా రోశయ్య పేరుగాంచారని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలసికట్టుగా ఉండాలని, తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించేవారని చెప్పారు.
అత్యున్నత విలువలకు మారుపేరుగా నిలిచిన వ్యక్తుల్లో రోశయ్య ఒకరని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు భాషకు, సంస్కృతికి, కళలకు ఆయన పెద్దపీట వేశారని చెప్పారు. రోశయ్య మరణం తెలుగువారందరికీ తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో 3 రోజుల సంతాప దినాలు
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
మంత్రులతో కలిసి రోశయ్య పార్థివ దేహాన్ని సందర్శించిన కేసీఆర్
మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి పార్థీవ దేహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహచర మంత్రులతో కలిసి సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. 4, 5, 6 తేదీలు సంతాప దినాలు.. అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు-తెలంగాణ ప్రభుత్వం
ఖమ్మం తో రోశయ్య కు ఎంతో అనుబంధం ఉంది .
సిపిఐ సీనియర్ నాయకులూ పువ్వాడ నాగేశ్వరరావు తో ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. పువ్వాడ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఖమ్మం కూడా వచ్చారు. ఆ సందర్భంగా వారి మధ్య ఉన్న ఆత్మీయ సంబంధాలను గురించి రోశయ్య వివరించారు. ఖమ్మం లో అనేక మందితో ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. సురేంద్రనాథ్ గుప్త , పులిపాటి ప్రసాద్ , చెరుకూరి కృష్ణమూర్తి , మమతా నగేష్ లాంటివారు రోశయ్య తో నిత్యా సంబంధాలు కలిగి ఉన్నారు . అందరికంటే సురేంద్రనాథ్ గుప్త నేరుగా వంటఇంట్లోకి వెళ్లే సంబంధాలు కలిగి ఉన్నారు. ఆయన గవర్నర్ గా ఉన్న ఖమ్మం నుంచి ఆయన దగ్గరకు వెళ్లి కలిసే వారు