Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వానికి కావాల్సినంత టైం ఇచ్చాం… స్పందన లేదనే ఈ ఉద్యమం: ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు!

ప్రభుత్వానికి కావాల్సినంత టైం ఇచ్చాం… స్పందన లేదనే ఈ ఉద్యమం: ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు!
-ఇవాళ ప్రారంభమైన ఏపీ జేఏసీ తొలిదశ ఉద్యమం
-ఆఫీసులకు నల్లబ్యాడ్జీలతో హాజరైన ఉద్యోగులు
-భోజన విరామ సమయాల్లో ధర్నాలు
-ట్రెజరీ ఉద్యోగులు,గెజిటెడ్ అధికారులు జేఏసీ ఉద్యమానికి దూరం
-10 రోజుల్లో పీఆర్సీ ఇస్తామంటే ఉద్యమాలు ఎందుకన్న ట్రెజరీ ఉద్యోగ సంఘం
-సీఎం జగన్ మీద నమ్మకం ఉందన్న కొన్ని సంఘాలు

ఉద్యోగుల పీఆర్సీ ప్రకటించే విషయంలో ఏపీ ఉద్యోగసంఘాల జేఏసీ ఉద్యమ బాట పట్టగా ట్రెజరీ , గెజిటెడ్ ఉద్యోగసంఘాల , జేఏసీ ఉద్యమానికి దూరంగా ఉన్నాయి. సీఎం జగన్ పీఆర్సీ 10 రోజుల్లో ఇస్తానని ప్రకటించారని అందువల్ల ఉద్యమాలకు తాము దూరం అని కొన్ని సంఘాలు ప్రకటించాయి. సీఎం ప్రకటనపై తమకు నమ్మకం ఉందని కూడా వారు పేర్కొనడం గమనార్హం .

పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని, అంత భయమెందుకని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామని, అయినా కూడా సర్కారు నుంచి స్పందన రాలేదని ఆయన మండిపడ్డారు.

ఇక స్పందన రాదని తెలుసుకునే ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. పీఆర్సీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఏపీ జేఏసీ అమరావతి తలపెట్టిన తొలిదశ ఉద్యమం ఇవాళ ప్రారంభమైంది. కర్నూలు, ఏలూరు, పాడేరు తదితర ప్రాంతాల్లో ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో ర్యాలీలు, ధర్నాలు చేసి నిరసన తెలియజేయనున్నారు. కర్నూలులో జరిగిన నిరసనల్లో బొప్పరాజు పాల్గొన్నారు.

ఇన్నాళ్లూ ప్రభుత్వం తమను రెచ్చగొట్టేలా ప్రవర్తించినా ప్రభుత్వాన్ని తాము ఇరుకునపడేయలేదని బొప్పరాజు గుర్తు చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో ఇన్నాళ్లూ సంయమనంతో ఉన్నామన్నారు. పీఆర్సీపై ప్రభుత్వం మొక్కుబడి కోసం ఒకట్రెండు సమావేశాలను నిర్వహించి చేతులు దులుపుకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని వల్ల ఉద్యోగులకు కలిగిన ప్రయోజనమేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న భావన ఉద్యోగుల్లో ఉందని ఆయన అన్నారు.

Related posts

కెనడాలో ప్రాణాంతక ‘జాంబీ’ వ్యాధి.. వ్యాక్సిన్లు, చికత్సల్లేవ్!

Drukpadam

కబడ్డీలో కూతకు వెళ్లి మరణించిన కబడ్డీ ప్లేయర్!

Drukpadam

లంచాలు తీసుకోక తప్పదన్న తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

Ram Narayana

Leave a Comment