Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎట్టకేలకు పాకిస్థాన్ చేరిన ‘బోర్డర్’ బాబు!

ఎట్టకేలకు పాకిస్థాన్ చేరిన ‘బోర్డర్’ బాబు!

  • అట్టారి-వాఘా సరిహద్దులో చిక్కుకుపోయిన పాకిస్థానీలు
  • సరిహద్దు వద్ద జన్మించిన బిడ్డకు ‘బోర్డర్’ అని నామకరణం చేసిన దంపతులు
  • ఎన్జీవో సహకారంతో ఎట్టకేలకు స్వదేశానికి

ఈ నెల 2న భారత్-పాకిస్థాన్ సరిహద్దులో జన్మించిన ‘బోర్డర్’ ఎట్టకేలకు సురక్షితంగా పాకిస్థాన్ చేరాడు. లాక్‌డౌన్‌కు ముందు కొందరు పాకిస్థానీలు భారత్‌ సందర్శనకు వచ్చారు. కరోనా సెకండ్ వేవ్ ఆంక్షల కారణంగా తిరిగి స్వదేశం పాకిస్థాన్ వెళ్లలేకపోయారు. ఆ తర్వాత ఆంక్షలు సడలించడంతో పాక్ వెళ్లేందుకు ప్రయత్నించగా, అవసరమైన పత్రాలు లేకపోవడంతో అట్టారి-వాఘా సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు వారిని అనుమతించలేదు. దీంతో దాదాపు 80 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయారు. మొత్తం 98 మంది పాకిస్థానీలు అక్కడి టెంట్లలోనే గడిపారు.

వీరిలో పంజాబ్ ప్రావిన్స్‌లోని రాజన్‌పూర్ జిల్లాకు చెందిన నింబోదేవి-బలమ్‌రామ్ దంపతులు కూడా ఉన్నారు. అప్పటికే నిండు గర్భిణి అయిన నింబోదేవి ఈ నెల 2న సరిహద్దులో స్థానిక ప్రజల సహకారంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ బిడ్డకు వారు ‘బోర్డర్’ అని నామకరణం చేశారు.

మరోవైపు, సరిహద్దులో పాక్ ప్రజలు కొన్ని రోజులుగా చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న ఓ ఎన్జీవో వారికి అవసరమైన వీసాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు సమకూర్చింది. దీంతో వారంతా తిరిగి స్వదేశమైన పాకిస్థాన్ చేరుకోగలిగారు.  అలా ‘బోర్డర్’ సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగాడు.

Related posts

తెలంగాణ వ్యాపితంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు…

Drukpadam

మూడు రాజధానులపై విచారణ ముందుగా చేపట్టలేము …సుప్రీం …!

Drukpadam

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఇకలేరు …

Drukpadam

Leave a Comment