గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారికి అవకాశం… గవర్నర్ ఆమోదం
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్
- గవర్నర్ కోటాలో మధుసూదనాచారికి చాన్స్ ఇచ్చిన కేసీఆర్
- గతంలో అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన మధుసూదనాచారి
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారికి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. తొలుత గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి పేరు ప్రతిపాదించింది. ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చాన్స్ రావడంతో, ప్రభుత్వం మధుసూదనాచారి పేరును గవర్నర్ ముందుంచింది.
మధుసూదనాచారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించారు. అయితే 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. గతంలో సభను నడిపించిన అనుభవం ఉన్న మధుసూదనాచారిని శాసనమండలి చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.