Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

సినిమా టికెట్స్ పెంపుదల వివాదంపై మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు!

సినిమా టికెట్స్ పెంపుదల వివాదంపై మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు!
ప్రజలు హర్షిస్తుంటే హీరోలకు కడుపుమంట ఎందుకు?
ఒక్కో హీరో కు 70 శాతం రెమ్యూనరేషన్ …దాన్ని తగ్గించుకోవచ్చన్న అనిల్
తమ రెమ్యూనరేషన్ ఖర్చును ప్రజలపై రుద్దడం న్యాయమా ?

సినిమా టికెట్స్ పెంపుదలపై మంత్రి అనిల్ యాదవ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోలు తమ రెమ్యూనరేషన్ తీసుకునేందుకు సామాన్యాలపై భారాలు మోపాలని అందం న్యాయమా అని ప్రశ్నించారు. ఒక్కో హీరోకి వచ్చే ఆదాయంలో 70 శాతం రెమ్యూనరేషనా ? ఇదెక్కడి న్యాయం తమ రెమ్యూనరేషన్ తగ్గించుకునే బదులు పెదాలపై భారం వేయమని కోరతారా ? అని మంత్రి ప్రశ్నించారు.

సినీ పరిశ్రమలో దోపిడీని అరికట్టేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. సినిమా ఖర్చులో 70 శాతం హీరోల రెమ్యూనరేషనే ఉంటోందని.. దాన్ని తగ్గించుకోవచ్చు కదా అని హీరోలను ఆయన ప్రశ్నించారు. నెల్లూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. టికెట్‌ ధరల అంశంలో సినీ నటుడు నాని గురువారం చేసిన వ్యాఖ్యలపై విలేకర్లు ప్రశ్నించగా ఆయనో భజనపరుడని అనిల్‌ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అనిల్‌ చెప్పారు. ప్రజలు హర్షిస్తుంటే హీరోలకు కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. ఎక్కడ రెమ్యూనరేషన్‌ తగ్గిపోతుందోననే బాధ హీరోలదని చెప్పారు. రెమ్యూనరేషన్‌కి అయ్యే ఖర్చును ప్రజలపై రుద్దడం ఎంతవరకు కరెక్టో చెప్పాలన్నారు. వకీల్‌సాబ్‌, భీమ్లానాయక్‌ సినిమాలకు అయిన ఖర్చెంత? పవన్‌ కల్యాణ్‌ రెమ్యూనరేషన్‌ ఎంత? అని ప్రశ్నించారు. అభిమానిగా కటౌట్లు కట్టి తానూ నష్టపోయానని అనిల్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

టికెట్ల ధరలు నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇష్టారీతిన టికెట్లు పెంచుకునే అధికారం ఉండకూడదని లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు కోర్టులు జీవో 35ను కొట్టేసినా.. ప్రజా ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకుంటాయని అన్నారు థియేటర్లకు వెళ్లేది దిగువ తరగతి వాళ్లే అయినందున ఖచ్చితంగా టికెట్ ధరలు నియంత్రణలో ఉండాలన్నారు

ఎవరి కోసం భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. సినిమా ప్రొడక్షన్ ఖర్చు నియంత్రించుకోవాలని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు.

Related posts

పెళ్లి చేసుకుని నేనుపడిన తిప్పలు ఆ దేవుడికే తెలియాలి: సినీ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య!

Drukpadam

బిగ్ బీకి కోపం వచ్చింది …కొడుకు కోడలు వీడిపోతున్నారనే వార్తలపై మండిపాటు

Ram Narayana

తండ్రిలాంటి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి.. చేతులు జోడించి అడుగుతున్నాం: జగన్ తో చిరంజీవి!

Drukpadam

Leave a Comment