Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

సెంట్ వ్యాపారి పీయూష్ జైన్ అరెస్ట్.. రూ.284 కోట్ల నగదు స్వాధీనం!

 సెంట్ వ్యాపారి పీయూష్ జైన్ అరెస్ట్.. రూ.284 కోట్ల నగదు స్వాధీనం!

  • -విచారణలో చాలా ప్రశ్నలకు జైన్ మౌనం
  • -400 కిలోల బంగారాన్ని విక్రయించినట్టు వెల్లడి
  • -పన్నులు మినహాయించుకుని మిగిలింది ఇవ్వాలని వినతి
  • -250 కిలోల వెండి, 25 కిలోల బంగారం స్వాధీనం

పన్నులు ఎగవేసి, భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన సమాజ్ వాదీ (ఎస్పీ) పార్టీ నేత, కాన్పూర్ కు చెందిన పెర్ ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ను డైరెక్టరేట్ ఆఫ్ జీఎస్ టీ ఇంటెలిజెన్స్ ఆదివారం అరెస్ట్ చేసింది. ఎన్ని ప్రశ్నలు సంధించినా కానీ, ఆయన వేటికీ సమాధానం ఇవ్వలేదని ఒక అధికారి వెల్లడించారు.

50 అధికారుల బృందం గత శుక్రవారం నుంచి పీయూష్ జైన్, ఆయన సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం తెలిసిందే. కాన్పూర్ లోని ఆనంద్ నగర్ లో ఉన్న జైన్ నివాసం నుంచి అధికారులు రూ.177 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కన్నౌజ్ లోని మరో ఇంట్లో నిర్వహించిన సోదాల్లో రూ.107 కోట్ల నగదు బయటపడింది. దీంతో మొత్తం రూ.288 కోట్ల కరెన్సీ నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ డబ్బంతా తన సొంతమేనని, 400 కిలోల బంగారాన్ని (పూర్వీకుల నుంచి) విక్రయించగా వచ్చిందని జైన్ అధికారులకు వెల్లడించడం గమనార్హం. ‘కావాలంటే ఈ మొత్తం నుంచి పన్నును మినహాయించుకుని మిగిలిందే నాకివ్వండి’ అంటూ అధికారులను జైన్ కోరాడు. బంగారాన్ని ఎందుకు విక్రయించాల్సి వచ్చింది? అన్న ప్రశ్నకు వ్యాపారంలో పెట్టుబడి అవసరమైనట్టు చెప్పాడు. కానీ, గత ఐదేళ్లలో ఆయన కొత్తగా ప్రారంభించిన వ్యాపారం ఏదీ లేదని, వ్యాపార విస్తరణ ప్రణాళికలు కూడా లేవని అధికారులు గుర్తించారు.

250 కిలోల వెండి, 25 కిలోల బంగారాన్ని కూడా కన్నౌజ్ లోని జైన్ నివాసం నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 9 డ్రమ్ముల గంధపు నూనె కూడా ఉందని గుర్తించారు. జైన్ సమాజ్ వాదీ నేత కావడంతో ‘సమాజ్ వాదీ’ పేరుతో ఒక పెర్ ఫ్యూమ్ ను కూడా మార్కెట్లోకి గతంలో తీసుకువచ్చారు.

Related posts

మరియమ్మ లాక్ అప్ డెత్ kesu లో ఎస్ ఐ ,ఇద్దరు కానిస్టేబుళ్ల ను ఉద్యోగాలు తొలగించిన తెలంగాణ ప్రభుత్వం ….

Drukpadam

పరిటాల సిద్ధార్థ బ్యాగులో తూటా.. శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం!

Drukpadam

తాడిప‌త్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడిపై పోలీసు కేసు!

Drukpadam

Leave a Comment