Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చెప్పులపై జీఎస్టీకి నిరసన.. చెప్పులు కుట్టి, పాలిష్ చేసిన సీపీఐ నారాయణ!

చెప్పులపై జీఎస్టీకి నిరసన.. చెప్పులు కుట్టి, పాలిష్ చేసిన సీపీఐ నారాయణ!
తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన
కేంద్రం కార్పొరేటర్లకు వంతపాడుతోందని ఆగ్రహం
సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి
విగ్రహాల ధ్వంసం దారుణం

సిపిఐ నారాయణ ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాలలో లేరు …ఎందుకంటే ఆయన ఏది చేసిన వినూత్నంగా ఉంటుంది. సంచలనకు మారుపేరు . తముడుకోకుండా ఎదుటివారిపై ఛలోక్తులు విసరడంతో దిట్ట …అంతే కాదు వ్యంగ బాణాలు వదలడంతో ఆయనకు ఆయనే సాటి. గతంలో గాంధీ జయంతి రోజున కోడి మాంసం తిని వార్తలలో వ్యక్తిగా నిలిచినా నారాయణ ఏడాది పాటు తాను మాంసం ముట్టనని శపధం చేసి దానికి కట్టుబడి ఉన్నారు. చెప్పులపై కేంద్రం జీఎస్టీ వేయడంపై ఆయన కొత్తతరహా లో నిరసన తెలిపి కేంద్ర నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు . స్వయంగా చెప్పులుకుట్టారు . దీంతో ఆయన చెప్పులు కుడుతున్న ఫోటోలు క్లిక్ మనిపించారు . మీడియా దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది .

కేంద్ర ప్రభుత్వం చెప్పులపై 12 శాతం జీఎస్టీ విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ రోజుకోలా నిరసన తెలుపుతున్నారు. ఇటీవల నెత్తిపై చెప్పులు పెట్టుకుని నిరసన తెలిపిన ఆయన.. నిన్న చెప్పులు కుట్టి, పాలిష్ చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ నిన్న ఉదయం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట చెప్పులు కుట్టి, పాలిష్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చెప్పులను కూడా వదలడం లేదని దుమ్మెత్తి పోశారు. సామాన్యుడి కష్టం తనకు తెలుసు కాబట్టే నెత్తిన చెప్పులు పెట్టుకున్నానని అన్నారు. దీనికి బీజేపీ నేతలు మాత్రం స్థాయి దిగజారిపోయారని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్లకు వంతపాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలోని సినిమా టికెట్ల వివాదంపై మాట్లాడుతూ.. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో అంబేద్కర్ విగ్రహాన్ని కూలదోయడానికి ప్రయత్నించడం శోచనీయమని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

సీఎం రేసులో లేని పవన్ కళ్యాణ్ కోసం తిరగటం ఎందుకు …పేర్ని నాని …!

Drukpadam

చర్చల ద్వారానే ఉద్యోగుల సమస్యలు పరిస్కారం …మంత్రులు బొత్స ,బాలినేని!

Drukpadam

రాజకీయాల్లో అసహజం అంటూ ఏమీ ఉండదు: సంజయ్ రౌత్!

Drukpadam

Leave a Comment