Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఆంక్షలతో ఒమిక్రాన్ ఆగదు.. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మందికి సోకచ్చు!

ఆంక్షలతో ఒమిక్రాన్ ఆగదు.. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మందికి సోకచ్చు: అమెరికా వైద్యుడి అంచనాలు

  • రోజూ 35 కోట్ల మంది దీని బారిన పడతారు
  • ఫిబ్రవరి నాటికి భారత్ లో గరిష్ఠాలకు కేసులు
  • టీకాలకు, ఆంక్షలకు వైరస్ ఆగదు
  • లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉంటాయంతే
  • డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రే అంచనాలు

కరోనా ఒమిక్రాన్ వైరస్ ఆంక్షలతో ఆగిపోయేది కాదని.. రెండు నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మంది దీని బారిన పడొచ్చని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు, ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రే అభిప్రాయపడ్డారు.

డెల్టా సమయంలో చూసిన మాదిరిగానే ఒమిక్రాన్ లోనూ పెద్ద సంఖ్యలో కేసులు భారత్ లో వస్తాయని క్రిస్టోఫర్ అంచనా వేస్తున్నారు. ‘‘టీకాలు తీసుకున్న వారిలో లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉంటాయి. కానీ, ఒమిక్రాన్ ఎక్కువ మంది జనాభాకు పాకిపోతుంది. ఎటువంటి ఆంక్షలు దీన్ని నియంత్రించలేవు’’ అని పేర్కొన్నారు.

జనవరిలోనే ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల మంది ఒమిక్రాన్ బారిన పడొచ్చని క్రిస్టోఫర్ అంచనా వేస్తున్నారు. డెల్టా గరిష్ఠ స్థాయిలో ఉన్న 2021 ఏప్రిల్ లోని గణాంకాలతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ అవుతుంది. భారత్ లో జనవరి చివరికి, లేదా ఫిబ్రవరిలో ఇన్ఫెక్షన్ కేసులు తారస్థాయికి చేరుకునే అవకాశం ఉందని క్రిస్టోఫర్ చెప్పారు.

Related posts

జులై నుంచి దక్షిణ కొరియాలో మాస్కులతో పనిలేదట!

Drukpadam

ఒమిక్రాన్‌తో డేంజరే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన!

Drukpadam

కర్ణాటకపై కరోనా పంజా… నిన్న ఒక్క రోజులోనే 39,305 కేసులు !

Drukpadam

Leave a Comment