Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అసోం సీఎంకు ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్!

అసోం సీఎంకు ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్!
-మరోసారి తెలంగాణకు వచ్చేటప్పుడు హోంవర్క్ చేసి రండిని హితవు
-ఇటీవల బండి సంజయ్ అరెస్ట్
-టీఆర్ఎస్ నాయకత్వంపై బీజేపీ నేతల విమర్శల దాడి
-దీటుగా బదులిస్తున్న టీఆర్ఎస్ నేతలు

ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో కమలనాథులు టీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు సీఎం కేసీఆర్ పై విమర్శల దాడి చేస్తున్నారు. దీనికి టీఆర్ఎస్ నేతలు కూడా దీటుగానే బదులిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

“2018 ఎన్నికల సమయంలో మీ పార్టీ నేతలు ఇలాగే మాట్లాడారు. కానీ ప్రజలు వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టారు. ఒక్క స్థానంలో గెలిచారు. 107 స్థానాల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. సీఎం కేసీఆర్ పథకాలు అద్భుతం అంటూ కేంద్రం కాపీ కొడుతోంది. కానీ రాష్ట్రానికి వచ్చే బీజేపీ నేతలు అందుకు విరుద్ధంగా మాట్లాడుతుంటారు. అలాంటివారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పుడు హోం వర్క్ చేసి రావాలని కోరుతున్నాం.

2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, ఆ లెక్కన ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? ఉద్యోగ కల్పనలో చిన్న దేశాలు కూడా భారత్ కంటే ముందంజలో ఉన్నాయి” అంటూ విమర్శించారు. ఈ క్రమంలో కవిత అసోం సీఎం చేసిన వ్యాఖ్యలను కూడా ట్విట్టర్లో పంచుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాలరాసేందుకు బీజేపీ ఎందుకు ప్రయత్నిస్తోందని నిలదీశారు.

Related posts

ఖమ్మం కాంగ్రెస్ సభకు ఎన్ని లక్షలమంది హాజరు …?

Drukpadam

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పాకిస్తాన్ కు ఘాటు హెచ్చరిక …

Drukpadam

బద్వేల్ బాధ్యత మంత్రి పెద్దిరెడ్డికి …వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ!

Drukpadam

Leave a Comment