Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

19 గ్రామాల అమరావతి కార్పొరేషన్ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రజలు…

19 గ్రామాల అమరావతి కార్పొరేషన్ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రజలు…
-అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ప్రతిపాదనకు ఎదురుదెబ్బ..
-ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ!
-19 గ్రామాలతో క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వం
-ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించిన 16 గ్రామాలు
-29 గ్రామాలతో కూడిన అమరావతి క్యాపిటల్ కే తాము అనుకూలమని చెప్పిన గ్రామాలు

అమరావతి కాపిటల్ సిటీ ప్రతిపాదనను కేవలం మూడు గ్రామాల ప్రజలు మాత్రమే సమర్థించగా మిగతా 16 గ్రామాలు వ్యతిరేకించాయి. మొత్తం కాపిటల్ పరిధిలోని 29 గ్రామాలతో కూడిన కార్పొరేషన్ కావాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అధికారులు తాము కేవలం అభిప్రాయసేకరణకు మంత్రమే వచ్చామని మీ అభిప్రాయాలు స్వేచ్ఛగా తెలియజేయవచ్చునని తెలిపారు . దీంతో ప్రజల అభిప్రాయాలను అధికారులు నోట్ చేసుకొని వెళ్లి పోయారు.

ఏపీ రాజధాని అమరావతిలోని 29 గ్రామాల్లోని 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసిన విషయం విదితమే. అయితే, ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా అధికారులు నిర్వహించిన గ్రామ సభల్లో 16 గ్రామాలు క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ప్రతిపాదనను వ్యతిరేకించాయి.

ఈ రోజు ఆఖరి గ్రామ సభను తుళ్లూరులో నిర్వహించారు. 2014 సీఆర్డీయే చట్టంలోని 29 గ్రామాలతో కూడిన అమరావతి క్యాపిటల్ కు మాత్రమే తాము అనుకూలమని గ్రామ సభల్లో ప్రజలు స్పష్టం చేశారు. 29 గ్రామాలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని… రాజధానిని ముక్కలు చేసే ప్రయత్నాన్ని మాత్రం తాము ఒప్పుకోబోమని చెప్పారు.

Related posts

అభ్యర్థుల జాబితాను రెడీ చేసిన పంజాబ్ కాంగ్రెస్.. రెండు స్థానాల నుంచి సీఎం చన్నీ పోటీ!

Drukpadam

రాహుల్ ప్రధాని అవుతారు : ప్రశాంత్ కిషోర్ మాట మార్చారు.

Drukpadam

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు జైలు శిక్ష.. ఇప్పటి వరకు పడని అనర్హత వేటు…

Drukpadam

Leave a Comment