Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విరాట్ కోహ్లీ నిర్ణయం షాకింగ్: రోహిత్ శర్మ

  • ఇన్ స్టా గ్రామ్ లో రోహిత్ పోస్ట్
  • కెప్టెన్ గా విజయవంతమైన సేవలు
  • భవిష్యత్తు బాగుండాలంటూ శుభాకాంక్షలు

భారత టెస్ట్ జట్టు కెప్టెన్ పదవికి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేయడం చాలా మందిని షాకింగ్ కు గురిచేస్తోంది. రవిశాస్త్రి మొదలు కొని చాలా మంది ఇప్పటికే స్పందన తెలియజేస్తున్నారు. తాజాగా భారత వన్డే, టీ20 క్రికెట్ జట్ల కెప్టెన్ రోహిత్ శర్మ సైతం కోహ్లీ నిర్ణయంపై ఆదివారం స్పందించాడు.

కోహ్లీ నిర్ణయం తనను షాక్ కు గురి చేసినట్లు చెప్పాడు. ‘‘షాక్డ్!! కానీ భారత కెప్టెన్ గా విజయవంతమైన సేవలు అందించినందుకు అభినందనలు’’అంటూ ఇన్ స్టాగ్రామ్ పై రోహిత్ పోస్ట్ పెట్టాడు. కోహ్లీ భవిష్యత్తు మరింత బాగుండాలంటూ హిందీలో శుభాకాంక్షలు తెలిపాడు.

కోహ్లీ నాయకత్వంలోనే రోహిత్ శర్మ ఓపెనర్ గా ఎంతో రాణించడం గమనార్హం. కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలు అంటూ ఇటీవల వార్తలు గుప్పుమనడం తెలిసిందే. కానీ, రోహిత్ కు కోహ్లీ మద్దతు ఎంతగానే ఉందని, కెప్టెన్ మద్దతుతోనే రోహిత్ మెరుగైన ప్రదర్శనతో కెరీర్ లో మరింత ఉన్నతిని చూసినట్టు పరిశీకుల అభిప్రాయం.

Related posts

వందే భారత్ రైలు ఖమ్మంలో ఆగుతుందా …?

Drukpadam

గవర్నర్ విషయంలో కేసీఆర్ సర్కార్ వెనకడుగు …కేసు ఉపసంహరణ !

Drukpadam

పవన్ ఆరోపణలు ఒక్కటైనా నిరూపించగలరా ? పేర్ని నాని సవాల్!

Drukpadam

Leave a Comment