Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పెగాసస్ లో ఇంకేమైనా కొత్త వెర్షన్ వచ్చిందేమో కనుక్కోండి: కేంద్రంపై చిదంబరం సెటైర్!

పెగాసస్ లో ఇంకేమైనా కొత్త వెర్షన్ వచ్చిందేమో కనుక్కోండి: కేంద్రంపై చిదంబరం సెటైర్!

  • మళ్లీ రేగిన పెగాసస్ దుమారం
  • ఇటీవల న్యూయార్క్ టైమ్స్ లో కథనం
  • భారత్ 2017లోనే పెగాసస్ ను కొన్నదని వెల్లడి
  • సుపారీ మీడియా అంటూ కేంద్రమంత్రి విమర్శలు
  • ఎప్పుడైనా ఆ పత్రికలు చదివారా? అంటూ చిదంబరం వ్యాఖ్యలు

న్యూయార్క్ టైమ్స్ కథనం నేపథ్యంలో పెగాసస్ దుమారం మరోసారి రేగింది. ఈ స్పైవేర్ ను భారత్ 2017లో ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యంగ్యం ప్రదర్శించారు. పెగాసస్ స్పైవేర్ లో కొత్త వెర్షన్ లు ఏమైనా వచ్చాయేమో ఇజ్రాయెల్ ను కనుక్కోండి… ఇదే తగిన సమయం అంటూ సెటైర్ వేశారు. భారత్, ఇజ్రాయెల్ దేశాల సంబంధాల్లో కొత్త లక్ష్యాలు ఇప్పుడు నిర్దేశించుకోవచ్చు అని ఎద్దేవా చేశారు.

“2017లో పెగాసస్ స్పైవేర్, ఇతర ఆయుధ ఒప్పందాల కోసం 2 బిలియన్ డాలర్ల డీల్ కుదిరిందని అంటున్నారు. 2024 ఎన్నికల కోసం కేంద్రం 4 బిలియన్ డాలర్లయినా చెల్లించగలదు. మరింత అభివృద్ధి పరిచిన స్పైవేర్లు మరిన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగానే ఉన్నట్టుంది ” అని విమర్శించారు.

కాగా, న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనంపై కేంద్రమంత్రి వీకే సింగ్ స్పందిస్తూ, అదొక సుపారీ మీడియా అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలను చిదంబరం తప్పుబట్టారు. “ఎప్పుడైనా న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ పత్రికలు చదివారా? వాటర్ గేట్, పెంటగాన్ పత్రాల కుంభకోణాలను బట్టబయలు చేయడం పత్రికలు ఎంత కీలకపాత్ర పోషించాయా తెలుసా? చరిత్ర తెలుసుకోవడం నచ్చకపోతే కనీసం సినిమాలు చూసైనా నేర్చుకోవాలి?”అని హితవు పలికారు.

Related posts

హెల్మెట్ లేకుండా బైక్ తీస్తే కేసే…హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సీరియస్ వార్నింగ్!

Drukpadam

ఎన్నికల వేళా యూపీ లో రంజుగా రాజకీయాలు…ములాయం కోడలు బీజేపీ తీర్ధం!

Drukpadam

బీహార్‌లో మ‌జ్లిస్‌కు షాక్‌.. ఆర్జేడీలో చేరిన న‌లుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు1

Drukpadam

Leave a Comment