Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెరాస లోనే కొనసాగుతా… మాజీ ఎంపీ పొంగులేటి పునరుద్ఘాటన !

తెరాస లోనే కొనసాగుతా… మాజీ ఎంపీ పొంగులేటి పునరుద్ఘాటన !
🔹 పార్టీ మారుతాననే వస్తున్న వార్తలు అవాస్తవం
🔹 ప్రజాభిమానమే నా బలం.. బలహీనత
🔹కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి
🔹 ముదిగొండలో పలు కుటుంబాలకు పరామర్శ

గత కొంతకాలంగా తాను తెరాస పార్టీని విడిచి వేరే పార్టీకి వెళ్తునాననే వస్తున్న వార్తలు అవాస్తం అని తెరాసలోనే తన రాజకీయ భవిష్యత్తు కొనసాగుతుందని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ముదిగొండ మండలంలో వివిధ గ్రామాలలో పర్యటించి పలు కుటుంబాలను పరామమర్శించారు . బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనపై ప్రజలు చూపిస్తున్న అభిమానమే తన బలం బలహీనత అని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం తన రాజకీయ భవిష్యత్తుకు ధోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. చిరుమర్రిలో కొడాలి కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించారు. వనంవారి కిష్టాపురంలో పూలూరి దినేష్ కుమార్ ఇటీవల చనిపోగా అతని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాణాపురంలో ఇటీవల వత్సవాయి గోపాళం భార్య చనిపోగా అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వల్లభిలో కొడాలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా పెద్దమండవలో పలు కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.

ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన మొదలుకొని ముదిగొండలో పర్యటన ముగిసేంత వరకు పార్టీ కార్యకర్తలు… అభిమానులు ఆయన్ను అనుసరించారు . సుమారు 20కి పైగా వాహనాలు శ్రీనివాస్ రెడ్డి పర్యటన ఆసాంతం అనుసరిస్తు వెళ్లాయి. ప్రత్యేకించి ముదిగొండ మండలంలోని గ్రామాల్లో ఏ గ్రామ వెళ్లిన ఆయన వెంట వందలాది మంది అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు . తనపై అమితమైన జనాదరణ చూసిన శ్రీనివాస్ రెడ్డి ప్రజాభిమానమే నా బలం.. బలహీనత అనే విషయం ఈ పర్యటన ద్వారా మరోమారు రుజువైందని పేర్కొన్నారు. రెట్టించిన ఉత్సాహంతో తన పర్యటనను కొనసాగిస్తూ బాధిత కుటుంబాలను ఓదారుస్తు ముందుకు సాగారు. నాకు ముందు ఖమ్మంలోని పర్యటించారు .

 

Related posts

ఢిల్లీలో ఈటల ,బండి సంజయ్ …అమిత్ షా తో భేటీ -రాష్ట్ర పరిస్థితులపై వివరణ…

Drukpadam

ఎంపీ పార్థసారథి రెడ్డికి తుమ్మల సత్కారం …

Drukpadam

వ‌య‌నాడ్‌లోని రాహుల్ గాంధీ కార్యాల‌యంపై దుండగుల దాడి… 

Drukpadam

Leave a Comment