Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజ్యాంగాన్ని అవమానించిన ముఖ్యమంత్రిని వెంటనే పదవి నుంచి తొలగించాలి!సీఎల్పీ నేత భట్టి

రాజ్యాంగాన్ని అవమానించిన ముఖ్యమంత్రిని వెంటనే పదవి నుంచి తొలగించాలి! సీఎల్పీ నేత భట్టి
-స్వాతంత్ర భారతదేశంలో ఏడూ దశాబ్దాల తరువాత రాజ్యాంగ పై ఇంత ప్రమాదకరమైన వ్యాఖ్యలు ఎవరు చేయలేదు
-కొత్త రాజ్యాంగం రావాలి అని ముఖ్యమంత్రి చెప్పడం తెలంగాణ ప్రజలుగా అందరం సిగ్గుపడాలి..
-అందరికి సమాన హక్కులు కల్పించిన గ్రంధం భారత రాజ్యాంగం..
-రాజ్యాంగం లేకపోతే రాజులు, రాజ్యాలు మాత్రమే ఉండేవి..
-దళితులు,గిరిజనులు,రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కాదు..

రాజ్యాంగాన్ని అవమానపరిచింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు . కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగం పరిరక్షణ కోసం జరుగుతున్న దీక్ష శిభిరాన్ని సందర్శించి మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు . కేసీఆర్ ఆలోచన విధానం ఏమిటో అర్థమైందని ఎలాటి వ్యక్తులు సమాజానికి పట్టిన చీడపురుగులని దుయ్యబట్టారు .

కేసీఆర్ ఎన్నికల్లో పోటీచేయడానికి , ,పాలన చేయడానికి అనర్హుడివి అందువల్ల ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . భారత రాజ్యాంగం పనికి రాదని చెప్పిన ముఖ్యమంత్రి ని తొలగిస్తే తప్ప భారత రాజ్యాంగం కు గౌరవం దక్కదని భట్టి అభిప్రాయపడ్డారు .
భారత రాజ్యాంగం ద్వారా పదవులు రావని కేసీఆర్ చెపుతున్న కేసీఆర్ వెనుక నిలబడతారా అని బడుగు బలహీన వర్గాల ప్రతినిధులను ప్రశ్నించారు . భారత రాజ్యాంగం పై మాట్లాడిన ముఖ్యమంత్రి ని బూతులు కాదు ఎం చేసిన తప్పు లేదని ఘాటుగా స్పందించారు .
భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పక్షాన మండల,జిల్లా స్థాయి ప్రత్యేక కార్యాచరణ తీసుకుందాం..అందరికి భారత రాజ్యాంగం అందించేలా చేద్దామని అన్నారు .ప్రతి సమస్యకు పరిష్కారం భారత రాజ్యాంగం చదవడం..రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన అంబెడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేద్దామని పిలుపు నిచ్చారు .

భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే టీఆరెస్ నేతలు ఆపార్టీని వదిలి బయటకు రావాలని పిలుపు నిచ్చారు . రాజ్యాంగం పై ఆరు మాసాల కార్యక్రమం చెప్పడమని పల్లె పల్లె లో రాజ్యాంగ గొప్పతనాన్ని చాటి చెబుదామని భట్టి పిలుపు నిచ్చారు .

Related posts

సంచలనం సృష్టిస్తున్న యనమల సోదరుడి ఫోన్ కాల్!

Drukpadam

ఏపీ సీఎం జగన్ ఇంటి వెనకాల శివశ్రీ ఇల్లు భద్రతా కారణాల రీత్యా కూల్చివేత!

Drukpadam

కారు పార్టీకి కూసుకుంట్లనే …ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులందరూ ఒకే సామాజికవర్గం !

Drukpadam

Leave a Comment