Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఓటమిని అంగీకరించిన రాములు నాయక్

ఓటమిని అంగీకరించిన రాములు నాయక్
తాను గెలిస్తే కొంతమందికి ఇబ్బంది అందుకే ఓడగొట్టారు
కాంగ్రెస్ నాయకత్వంపై ఫైర్
-కొంతమంది రెడ్డి నాయకులూ సహకరించలేదు
-కొన్ని చోట్ల కరపత్రాలు కూడా పంచలేదు
-నియోజవర్గానినికి 5 వేల ఓట్లు ఉన్న రాలేదు
-ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కరే నాకోసం పనిచేశారు
-బంజారాల ఓట్లు పడ్డాయి
క్యాస్ట్ అండ్ కాష్ పని చేసింది
-పార్టీ సమావేశంలో అన్ని చెబుతా
కేవలం నాలుగు రౌండ్ లే పూర్తి అయ్యాయి.తన ఫలితం ఊహించిన కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ కాంగ్రెస్ నాయకత్వంపై ,జిల్లాలలో పార్టీ నాయకులపై ,రెడ్లపై అసంతృప్తి ని వ్యక్తం చేశాడు. తన ఓటమిని అంగీకరించి కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు. తాను గెలిస్తే కొంతమంది నాయకులకు ఇబ్బంది ఐతదని ఓడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు కొంత మంది రెడ్డి నాయకులు,డీసీసీ అధ్యక్షులు సహకరించలేదన్నారు. తన కరపత్రాలు కూడా కొంత మంది పంచలేదని వాపోయారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 5 వేల ఓట్లు రావాల్సి ఉన్న రాలేదని దీనికి నాయకత్వానిది భాద్యత కదా అని ప్రశ్నించారు.టీపీసీసీ అధ్యక్షులు ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే తనకోసం పని చేశారని అభిప్రాయపడ్డారు. తనకు తన సామాజిక వర్గానికి చెందిన బంజారాల ఓట్లు పడ్డాయని అన్నారు. క్యాస్ట్ అండ్ కాష్ పని చేసిందని అన్నారు. ఏ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని కోదండరాం కు ఇన్నిఓట్లు ఎలా వచ్చాయని అన్నారు. తాను గెలిస్తే కొంతమంది కి ఇబ్బంది ఐతదని ఓడగొట్టారని అన్నారు. గాంధీ భవన్ లో సమావేశం పెట్టి ఈ విషయాలన్నీ చెబుతానని అన్నారు.

Related posts

కర్నూల్ కు న్యాయరాజధాని ….? మంత్రి సురేష్ మాటల్లోనే

Drukpadam

నేను ఈ స్థాయికి రావడానికి ఆనం కుటుంబం ఎంతో చేసింది: ఏపీ మంత్రి కాకాణి!

Drukpadam

మొన్న పోస్టర్లు.. రేపు ధర్నాలతో మోదీకి స్వాగతం పలకనున్న బీఆర్ఎస్!

Drukpadam

Leave a Comment