ఏపీ మంత్రి సిదిర అప్పలరాజు కు సీఎం పర్యటనలో అవమానం!
సీఎం ను కలిసేందుకు శారదా పీఠం లోకి అనుమతించాలన్న మంత్రి
సీఎం కలిసే వాళ్ళ లో మీ పేరు లేదన్న పోలీస్ అధికారులు
సి ఐ పై విరుచుకుపడ్డ మంత్రి
మంత్రి మాటలను తప్పు పడుతున్న రాజకీయ వర్గాలు
తనకు జరిగిన అవమానం మొత్తం ఆంధ్రప్రదేశ్ కు జరిగిందన్న మంత్రి
ఏపీ మంత్రి సిదిర అప్పలరాజు విశాఖ పర్యటనలో ఉన్న సీఎం జగన్ కలిసేందుకు వచ్చారు . అప్పుడు జగన్ శారదా పీఠం లోపల పూజల్లో ఉన్నారు . లోపాలకి ఎవరిని పంపవద్దని సెక్యూరిటీ అధికారులనుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో పోలీస్ అధికారులు ఎవరిని లోపాలకి అనుమతించడంలేదు . ఆలశ్యంగా అక్కడకు చేరుకున్న మంత్రి అప్పలరాజు తనను లోపాలకి వెళ్లనివ్వాలని అడిగారు .అందుకు అక్కడ ఉన్న అధికారులు ఎవరరిని లోపలకు పంపవద్దని ఆదేశాలు ఉన్నాయని అందువల్ల ఇప్పడు పంపడం కుదరదని అన్నారు . దీంతో మంత్రికి పోలిసుల మీద కోపం వచ్చింది. అక్కడ ఉన్న సి ఐ పై చిందులు తొక్కారు . అక్కడ ఉన్నవారంతా మంత్రి మాటలకూ అవాక్కు అయ్యారు.
ఇదేం భాష… మంత్రి సీదిరి అప్పలరాజును వెంటనే తొలగించాలి: విష్ణువర్ధన్ రెడ్డి
విశాఖ శారదా పీఠం వద్ద జరిగిన వాగ్యుద్ధంలో ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ఓ పోలీసు అధికారిని బూతులు తిట్టడం తీవ్ర విమర్శల పాలవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పంచుకున్నారు. ఏపీలో ఓ మంత్రి భాష ఇలా ఉందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీస విలువలు లేకుండా తీవ్ర అహంకారం ప్రదర్శించారని విమర్శించారు.
పోలీసులూ… మిమ్మల్ని మీరు రక్షించుకోలేకపోతే మీరు ప్రజలను ఏం రక్షిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. మంత్రి సీదిరి అప్పలరాజును వెంటనే పదవి నుంచి తొలగించాలని సీఎం జగన్ ను కోరారు. అంతేకాకుండా, మంత్రిపై పోలీసు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు.