Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏదో ఒక రోజు ఓ హిజాబీ దేశ ప్ర‌ధాని అవుతారు: ఒవైసీ

ఏదో ఒక రోజు ఓ హిజాబీ దేశ ప్ర‌ధాని అవుతారు: ఒవైసీ

  • హిజాబ్ ధ‌రిస్తాన‌ని ఓ ఆడ‌పిల్ల త‌న త‌ల్లిదండ్రుల‌తో అంటుంది
  • అందుకు త‌ల్లిదండ్రులు కూడా అంగీక‌రిస్తారు
  • హిజాబ్ ధ‌రించ‌కుండా ఎవ‌రు ఆపుతారో చూద్దామంటారు
  • హిజాబ్ ధ‌రించే ఎదుగుతార‌న్న ఒవైసీ

క‌ర్ణాట‌క‌లో చెల‌రేగిన హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశమైన విష‌యం తెలిసిందే. దీనిపై ఏఐఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. ఏదో ఒక‌రోజు ఒక హిజాబీ దేశ‌ ప్ర‌ధాన మంత్రి అవుతార‌ని ఆయ‌న ఓ వీడియోను పోస్ట్ చేశారు.

హిజాబ్ ధ‌రిస్తాన‌ని ఓ ఆడ‌పిల్ల త‌న త‌ల్లిదండ్రుల‌తో అంటుందని, అందుకు త‌ల్లిదండ్రులు కూడా అంగీక‌రిస్తార‌ని చెప్పారు. హిజాబ్ ధ‌రించ‌కుండా ఎవ‌రు ఆపుతారో చూద్దామ‌ని ధైర్యం చెబుతారని ఆయ‌న చెప్పారు. ఆడ‌పిల్ల‌ హిజాబ్ ధ‌రించి వైద్యురాలు కూడా అవుతుందని, క‌లెక్ట‌ర్, వ్యాపార‌వేత్త కూడా అవుతుందని ఆయ‌న వ్యాఖ్యానించారు.

దేవుడి ద‌య‌వ‌ల్ల ఏదో ఓ రోజు హిజ‌బ్ ధ‌రించిన మ‌హిళే ప్ర‌ధాని కూడా అవుతారని ఆయ‌న చెప్పారు. తాను బ‌తికి లేకున్నా హిజ‌బ్ ధ‌రించిన మ‌హిళ త‌ప్ప‌కుండా ప్ర‌ధాని అవుతారని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాగా, దేశంలో చెల‌రేగుతోన్న హిజాబ్ వ్య‌వ‌హారంపై ప‌లు దేశాలు కూడా స్పందించిన విష‌యం తెలిసిందే.

Related posts

Everyday Makeup Tut-orial in Less Than 2 Minutes

Drukpadam

తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న‌ వైసీపీ కార్యాలయం కూల్చివేత!

Ram Narayana

పవన్ కల్యాణ్ అనే నేను అనగానే చప్పట్లు, కేకలతోో మార్మోగిన సభా ప్రాంగణం…

Ram Narayana

Leave a Comment