Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత …ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు :చంద్రబాబు

జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది… అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు: చంద్రబాబు

  • రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు వ్యాఖ్యలు
  • వ్యతిరేకత పెరుగుతుందని భయపడుతున్నారని వెల్లడి
  • ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ ఓడిపోతాడన్న చంద్రబాబు
  • ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరణ

సీఎం జగన్, వైసీపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. త్వరలోనే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకత ఇంకా పెరగవచ్చన్న ఉద్దేశంతో ముందస్తు ఎన్నికల యోచన చేస్తున్నారని వివరించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని చంద్రబాబు స్పష్టం చేశారు. నెత్తిమీద కుంపటిని దించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు.

సీఎం జగన్ పక్కా క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మేన్ అని విమర్శించారు. అమ్మఒడి విషయంలో మాట తప్పారు మడమ తిప్పారు అని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దిశం చట్టం అని ప్రచారం చేశారని, కానీ దానికి ఇంతవరకు చట్టబద్ధత లేదని అన్నారు. తాము నిర్మించిన పోలీస్ స్టేషన్లకు రంగులు వేసి దిశ పీఎస్ లు అంటూ హడావుడి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Related posts

పెగాసస్ వివాదం.. రేపు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామన్న రేవంత్‌రెడ్డి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన రేవంత్

Drukpadam

హైటెన్షన్ నడుమ మమతా బెనర్జీ విజయం… 1200 ఓట్ల తేడాతో ఓడిన సువేందు

Drukpadam

ఇద్దరు పెద్దోళ్ల కూతుళ్ళ మధ్య ట్విట్టర్ యుద్ధం …!

Drukpadam

Leave a Comment