Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి గాంధీలు తప్పుకోవాలి: కపిల్ సిబాల్ !

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి గాంధీలు తప్పుకోవాలి :కపిల్ సిబాల్!
2014 ఎన్నికల నుంచి అన్ని ఎన్నికల్లో ఓడిపోతూనే ఉన్నాం
కొత్త వ్యక్తికి బాధ్యతలను అప్పగించాలి
సీడబ్ల్యూసీలో ఉన్నవారికి మాత్రమే పార్టీ నాయకత్వంపై నమ్మకం ఉంది

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి గాంధీలు తప్పుకోవాలి …ఇది సీనియర్ అసమ్మతినేత కపిల్ సిబాల్ నోట మాట …సీడబ్ల్యూ సి జరిగిన కొద్దీ గంటల్లోనే ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీ హైకమాండ్ చేసిన నిర్ణయాన్ని తప్పుపడుతూ గతంలోనూ ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీని బతికించడానికేనా లేక చంపడానికా అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. పార్టీ ఫోరమ్ లో మాట్లాడితే తప్పులేదు కానీ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కి నష్టం చేసే చర్యలు సరికాదనే కాంగ్రెస్ వాదులు అంటున్నారు . కొంత కాలంగా కాంగ్రెస్ లో అసమ్మతి కొనసాగుతూనే ఉంది.

కాంగ్రెస్ లో అసమ్మతి సెగలు చల్లారడంలేదు. గాంధీ కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకొని కొంతమంది నేతలు నిత్యం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఏ ఎన్నికజరిగిన కాంగ్రెస్ ఓడిపోతే అది గాంధీ కుటుంబానికి అంటగట్టి ప్రచారం చేయడం పరిపాటిగా మారింది.ప్రధానంగా కపిల్ సిబాల్ ,గులాం నబి ఆజాద్ లాంటి నేతలు ఒకందుకు ముందుకేసి గాంధీ ఫ్యామిలీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు . తాజాగా జరిగిన సీడబ్ల్యూ సి సమావేశంలో గాంధీ ఫ్యామిలీ గురించి మాటాడని నేతలు బయటకు వచ్చి గాంధీ ఫ్యామిలీకి సీడబ్ల్యూ సి మాత్రమే మద్దతు ఉందని బయట అంతా వారు తప్పుకొని కొత్తవారికి భాద్యతలు అప్పగించాలని అంటున్నారని సిబాల్ చెప్పడం విడ్డురంగా ఉందనే విమర్శలు ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ ప్రాభవం తగ్గిపోతుందనేది అందరు అంగీకరించే అంశమే . ఏ ఎన్నికలు జరిగినా చాలా దారుణమైన ఫలితాలను చవిచూస్తోంది. మొన్న జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ గెలుపొందింది. మరోవైపు ఇప్పటికే పార్టీ అధిష్ఠానంపై సీనియర్ నేతలు గా చెప్పబడుతున్న వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి గాంధీలు తప్పుకోవాలని ఆయన అన్నారు. మరొక వ్యక్తికి నాయకత్వాన్ని అప్పగించాలని చెప్పారు. అసమ్మతి నేతలు ముఖుల్ వాస్నిక్ పేరు తెరపైకి తెస్తున్నారు. ఆయన సీనియర్ నేత అయినప్పటికీ గాంధీ కుటుంబాన్ని కాదని వేరే వ్యక్తికి పార్టీ భాద్యతలు అప్పగిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని కొందరు సీనియర్ నాయకులూ అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలనే విషయంలో అందరికి ఒకే అభిప్రాయం ఉన్నా ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలోనే భిన్నాభి ప్రాయాలు ఉన్నాయి.

2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్ని సందర్భాల్లో తప్ప అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతూనే ఉందని సిబాల్ అన్నారు. సీడబ్ల్యూసీలో ఉన్నవారు మాత్రమే పార్టీ నాయకత్వంపై నమ్మకం ఉంచారని… సీడబ్ల్యూసీ వెలుపల ఉన్నవారు కొత్త వ్యక్తికి పార్టీ పగ్గాలను అప్పగించాలని కోరుకుంటున్నారని చెప్పారు.

పార్టీని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని కోరుతూ సోనియాగాంధీకి గతంలో రాసిన లేఖపై సంతకం చేసిన వారిలో కపిల్ సిబాల్ కూడా ఉన్నారు. అయితే ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ పార్టీ నాయకత్వాన్ని మార్చాలనే అంశాన్ని ప్రస్తావించలేదు.

Related posts

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు …బీఆర్ యస్ లో ఆతర్మధనం…!

Drukpadam

పోతిరెడ్డిపాడు లిఫ్ట్ పై చంద్రబాబు వైఖరేంటో స్పష్టం చేయాలి: సజ్జల…

Drukpadam

జగన్ పై లోకేష్ అనుచిత వ్యాఖ్యలు …మండలిలో మంత్రి నారాయణస్వామి మండిపాటు!

Drukpadam

Leave a Comment