Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయురాలిని కారులో ఎక్కించుకుని అఘాయిత్యం.. ఖమ్మంలో దారుణం

  • రైలు కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయురాలికి లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఘోరం
  • సెల్‌ఫోన్ లాక్కుని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం
  • పరారీలో నిందితుడు

లిఫ్ట్ ఇస్తానంటూ ఉపాధ్యాయురాలిని నమ్మించి.. ఆపై బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడో ఉపాధ్యాయుడు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మంలో నివసిస్తున్న బానోతు కిశోర్ మహబూబ్‌నగర్ జిల్లా గార్ల మండలంలోని అంకన్నగూడెం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడి భార్య కూడా ఉపాధ్యాయురాలే. భార్యాభర్తలు ఇద్దరూ రోజూ కారులో పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. 

ఖమ్మంలోనే ఉంటున్న మరో ఉపాధ్యాయురాలు డోర్నకల్ వరకు ప్యాసింజర్ రైలులో, అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపైన స్కూలుకు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 17న స్కూలు ముగిసిన అనంతరం ఇంటికి వచ్చేందుకు రైల్వే స్టేషన్‌లో వేచి చూస్తున్న ఉపాధ్యాయురాలిని చూసిన కిశోర్.. కారులో డ్రాప్ చేస్తానని నమ్మించాడు. 

కొంతదూరం వెళ్లాక ఆమెను బెదిరించి సెల్‌ఫోన్ లాక్కున్నాడు. మార్గమధ్యంలో పాండురంగాపురంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆమె కొన్ని రోజులు ఎవరికీ చెప్పలేదు. మంగళవారం ధైర్యం చేసి భర్తకు చెప్పడంతో ఇద్దరూ కలిసి ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కిశోర్ కోసం గాలిస్తున్నారు.

Related posts

తిరుమల కొండపై భక్తులకు శుభవార్త -గదుల కేటాయింపుకు రిజిస్ట్రేషన్…

Drukpadam

Why Consumer Reports Is Wrong About Microsoft’s Surface Products

Drukpadam

32 ఏళ్ల క్రితం రూ. 100 లంచం.. 82 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి ఏడాది జైలు!

Drukpadam

Leave a Comment