Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉచితాల‌ను ఆప‌క‌పోతే.. ప్ర‌తి రాష్ట్రం ఓ శ్రీలంకే: జేపీ వార్నింగ్‌

ఉచితాల‌ను ఆప‌క‌పోతే.. ప్ర‌తి రాష్ట్రం ఓ శ్రీలంకే: జేపీ వార్నింగ్‌

  • న్యూస్ ఛానెల్ డిబేట్లో పాల్గొన్న జేపీ
  • రాష్ట్రాల ఆర్థిక స్థితిగ‌తుల‌పై లోతైన విశ్లేష‌ణ‌
  • ఉత్పాద‌కత‌ను మ‌రిచి ఉచితాల బాట ప‌డితే న‌ష్ట‌మ‌ని వార్నింగ్

ప్ర‌స్తుతం ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న ఉచిత ప‌థ‌కాల‌ను ఇంకా కొన‌సాగిస్తే.. భ‌విష్య‌త్తులో ప్ర‌తి రాష్ట్రం ఓ శ్రీలంక‌లా మారిపోవ‌డం ఖాయ‌మేన‌ని లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ హెచ్చరించారు. శ్రీలంక‌లో దాపురించిన దుస్థితి, ఉక్రెయిన్‌-ర‌ష్యాల మ‌ధ్య కొన‌సాగుతున్న యుద్ధం నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాల ఆర్థిక ప‌రిస్థితి.. అందులో ప్ర‌త్యేకించి భార‌త ఆర్థిక ప‌రిస్థితి ఏమిట‌న్న దానిపై ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్న సందర్భంగా జేపీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్ప‌టికే ఎఫ్ఆర్‌బీఎం ప‌రిధిని దాటేసి అప్పులు చేసేశాయ‌ని చెప్పిన జేపీ.. ఉత్పాద‌క‌త లేకుండా వ‌చ్చిన బోటాబొటి ఆదాయాన్ని ఉచిత ప‌థ‌కాల‌కు ఖర్చు చేయ‌డం స‌రికాద‌ని సూచించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప‌లు రాష్ట్రాల ఆర్థిక ప‌రిస్థితిని వివ‌రించారు. అదే స‌మ‌యంలో 1991లో త‌లెత్తిన ఆర్థిక సంక్షోభం నేప‌థ్యంలో ఎలాగైతే ఎఫ్ఆర్‌బీఎంను తీసుకొచ్చామో.. ఇప్పుడు కూడా అలాంటి ఓ క‌ట్టుదిట్ట‌మైన క‌ట్టుబాటును ఏర్పాటు చేయ‌క‌పోతే.. ఉచితాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌లేమ‌ని జేపీ చెప్పుకొచ్చారు.

Related posts

పాక్ జాతీయ అసెంబ్లీలో గందరగోళం… ఏప్రిల్ 3కి వాయిదా పడిన సభ!

Drukpadam

మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు!

Drukpadam

ఖమ్మం కు మరో మణిహారం

Drukpadam

Leave a Comment