Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోదీకి నితీశ్ పాదాభివంద‌నం!.. తప్పేముంద‌న్న జేడీయూ!

మోదీకి నితీశ్ పాదాభివంద‌నం!.. తప్పేముంద‌న్న జేడీయూ!

  • యోగి ప్ర‌మాణ స్వీకారానికి అతిథిగా నితీశ్
  • అక్క‌డే మోదీకి పాదాభివంద‌నం చేశార‌న్న ర‌బ్రీ దేవి
  • అందులో త‌ప్పేమీ లేదంటూ జేడీయూ కౌంట‌ర్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎంగా యోగి ఆదిత్య‌నాథ్ ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి బీజేపీకి చెందిన జాతీయ స్థాయి నేత‌లంతా క్యూ క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. పొరుగు రాష్ట్రం సీఎం హోదాలో బీహార్ ముఖ్య‌మంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ఓ కీల‌క ఘ‌ట‌నపై బీహార్ మాజీ సీఎం ర‌బ్రీ దేవి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

యోగి ప్ర‌మాణ స్వీకారానికి వ‌చ్చిన మోదీకి నితీశ్ కుమార్ పాదాభివంద‌నం చేశార‌ని చెప్పిన ర‌బ్రీ దేవి.. ఇందుకు చాలా కార‌ణాలున్నాయంటూ సెటైర్లు సంధించారు. ర‌బ్రీ దేవి వ్యాఖ్య‌ల‌పై జేడీయూ చాలా వేగంగానే స్పందించింది. మోదీకి నితీశ్ పాదాభివంద‌నం చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పిన జేడీయూ.. ప్ర‌ధాని హోదాలో ఉన్న మోదీకి పాదాభివంద‌నం చేయ‌డంలో త‌ప్పేమీ లేద‌ని, అది గౌర‌వ‌ప్ర‌ద‌మేన‌ని వ్యాఖ్యానించింది.

Related posts

జలదోపిడిపై కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ సంచలన వ్యాఖ్యలు…

Drukpadam

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటల్లోమర్మమేమిటి …?

Drukpadam

ఢిల్లీలో కేసీఆర్‌… బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప‌రిశీలించిన తెలంగాణ సీఎం!

Drukpadam

Leave a Comment