Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ప్రభుత్వ ఉపాధ్యాయుడు 23 కాలేజీలకు యజమాని… ఆస్తులు చూసి అవాక్కైన అధికారులు!

ప్రభుత్వ ఉపాధ్యాయుడు 23 కాలేజీలకు యజమాని… ఆస్తులు చూసి అవాక్కైన అధికారులు!
-మధ్యప్రదేశ్ లో టీచర్ గా పనిచేస్తున్న ప్రశాంత్ పర్మార్
-ఆర్థికశాఖ అధికారుల దాడులు
-పలు బీఈడీ, డీఈడీ, నర్సింగ్ కాలేజీలు నడిపిస్తున్న పర్మార్

మధ్య ప్రదేశం లోని ఒక ప్రభుత్వ ఉపాద్యాయుడు ఏకంగా 23 కాలేజీ లకు అధిపతిగా ఉన్నాడంటే ఆశ్చర్యమే . ఒక సామాన్య స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న ప్రశాంత్ పర్మార్ ఒకటికాదు రెండు కాదు ఇన్ని కాలేజీలను ఎలా స్థాపించాడు . వాటిని ఎలా నడుపుతున్నాడనేది ప్రభుత్వ అధికారులకు సైతం అర్థం కానీ విషయంగా మారింది. అవి కూడా ఉన్నత విద్యను బోధించే కాలేజీ లు కావడం గమనార్హం . అతని ఆదాయం పై కన్నేసిన ప్రభుత్వం దాడులు చేసింది. దీంతో వారు నివ్వెరపోయే విషయాలు తెలుసుకున్నారు . ఒక సామాన్య టీచర్ 23 కాలేజీ లను స్థాపించు వాటిని జయప్రదంగా నడపడం ఒకపక్క అతని తెలివి తేటలను ప్రశంసించకూడ ఉండలేక మరోపక్క ఇన్ని కాలేజీలు పెట్టడానికి ఉన్న ఆదాయవనరులపై ఆరా తీస్తున్నారు .

మధ్యప్రదేశ్ లోని ఓ సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆస్తులు చూసి అధికారులు అవాక్కయ్యారు. ఆ ఉపాధ్యాయుడి పేరు ప్రశాంత్ పర్మార్. ఘాటిగావ్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. జీతం వేలల్లోనే ఉంటుంది.

అయితే, ప్రశాంత్ పర్మార్ 20 డీఈడీ, బీఈడీ కాలేజీలు, 3 నర్సింగ్ కాలేజీలకు యజమాని అంటే ఆశ్చర్యం కలగకమానదు. మధ్యప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు చేసిన దాడుల్లో నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. కోట్ల విలువ చేస్తే ఆస్తులకు అతడు అధిపతి అని తెలుసుకున్నారు. ఏకకాలంలో అతడి నివాసం, ఇతర ప్రదేశాల్లో దాడులు చేపట్టారు. గ్వాలియర్, చంబల్ ప్రాంతాల్లో పర్మార్ అనేక కాలేజీలు నడిపిస్తున్నట్టు గుర్తించారు.

సాధారణ స్కూలు టీచర్ ఇన్ని కాలేజీలకు ఎలా యజమానిగా మారాడన్న అధికారులను విస్మయానికి గురిచేసింది. 2006లో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరినప్పుడు ప్రశాంత్ పర్మార్ నెల జీతం రూ.3,500 కాగా, కొద్దికాలంలోనే ఈ స్థాయికి రావడానికి ఏ స్థాయిలో అక్రమాలు చేశాడో అని అధికారులు విస్తుపోయారు.

Related posts

పంజాబ్‌లో కాంగ్రెస్ నేత కాల్చివేత.. తామే చంపేశామన్న ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ

Ram Narayana

మంచిర్యాల సజీవ దహనం కేసులో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

Drukpadam

ప్రభుత్వ హాస్పిటల్ సూపరెంటెండెంట్ కు ఇదేం పాడుబుద్ది …..

Drukpadam

Leave a Comment